LIC Holders: LIC పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఖాతాదారుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..

| Edited By: Team Veegam

Feb 15, 2021 | 3:57 PM

మీరు LIC పాలసీదారులా ? అయితే మీకు ఇది శుభవార్తే. దేశీయ దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

LIC Holders: LIC పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఖాతాదారుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..
Follow us on

మీరు LIC పాలసీదారులా ? అయితే మీకు ఇది శుభవార్తే. దేశీయ దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎన్ని ఉన్నా.. ఎల్ఐసీ కంపెనీ అతి పెద్ద భీమా కంపెనీగా ఇప్పటికీ కొనసాగుతుంది. అత్యధిక పాలసీదారులున్న సంస్థగా ఎల్ఐసీ నిలిచింది. ఇప్పటికీ ఈ సంస్థలో పాలసీ తీసుకునేవారు అధికంగానే ఉన్నారు. ఇలా ఎల్ఐసీ పాలసీ తీసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎల్ఐసీ ఐపీవోకు రానుంది. దేశ చరిత్రలో స్టాక్ మార్కెట్ విభాగంలో అతిపెద్ద ఐపీవోగా ఎల్ఐసీ కానుందని ఇప్పటికే నిపుణులు అంచనాలు వేశారు.

ఈ ఏడాది కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‏లో ఎల్ఐసీ ఐపీవోను వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకువస్తామని ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు మొత్తం ఇందులోనే ఉన్నారు. కేంద్రం ప్రభుత్వం ఎల్ఐసీ పాలసీ తీసుకున్న వారికి ఈ ఐపీవోలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తుంది. ఎల్ఐసీ ఐపీవో ఇష్యూ సైజులో 10 శాతం వాటాను ఎల్ఐసీ పాలసీదారులకు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.1.75 లక్షల కోట్ల డిజిన్వెస్ట్‏మెంట్‏ను చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూకు తీసుకురానుంది.

Also Read: LIC Warning : పాలసీదారులకు ఎల్‌ఐసీ హెచ్చరిక… అలా చేస్తే ఇబ్బంది పడాల్సి రావొచ్చని సూచన

హెలికాప్టర్ కొనుక్కోవడానికి రుణం ఇప్పించండి… రాష్ట్రపతికి లేఖ రాసిన ఓ మహిళ..

కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారా ? తెలంగాణలో రేషన్ కార్డుకు ఇలా అప్లై చేయండి.