Small Savings Schemes: పెట్టుబడిదారులకు గుడ్‌ న్యూస్‌.. అప్పటి వరకూ వడ్డీ రేట్లు యథాతథం

|

Sep 09, 2023 | 8:30 PM

తాజాగా చిన్న మొత్తాల పొదుపు పథకాలైన పీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఎన్‌ఎస్‌సీ, కేవీపీతో సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తున్నప్పటికీ ప్రభుత్వం అటువంటి పథకాలపై వడ్డీ రేట్లను అక్టోబర్-డిసెంబర్ 2023కి ఈ నెలాఖరున అంటే సెప్టెంబర్ 29 లేదా సెప్టెంబర్ 30న సవరిస్తుంది. అయితే ఇటీవల వెల్లడైన ఓ నివేదిక ప్రకారం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

Small Savings Schemes: పెట్టుబడిదారులకు గుడ్‌ న్యూస్‌.. అప్పటి వరకూ వడ్డీ రేట్లు యథాతథం
Saving Tips
Follow us on

కష్టపడి సంపాదించిన సొమ్మును మంచి రాబడి కోసం పెట్టుబడిదారులు వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. వీరికి సాయం చేసేలా ప్రభుత్వ మద్దతుతో కొన్ని పథకాలు ప్రజాదరణ పొందాయి. వీటికి వడ్డీని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. తాజాగా చిన్న మొత్తాల పొదుపు పథకాలైన పీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఎన్‌ఎస్‌సీ, కేవీపీతో సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తున్నప్పటికీ ప్రభుత్వం అటువంటి పథకాలపై వడ్డీ రేట్లను అక్టోబర్-డిసెంబర్ 2023కి ఈ నెలాఖరున అంటే సెప్టెంబర్ 29 లేదా సెప్టెంబర్ 30న సవరిస్తుంది. అయితే ఇటీవల వెల్లడైన ఓ నివేదిక ప్రకారం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం, చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు నాలుగు శాతం (పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్లు), 8.2 శాతం (సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్) మధ్య ఉన్నాయి. కాబట్టి ఈ పథకాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

చిన్న పొదుపు పథకాలు అంటే?

చిన్న పొదుపు పథకాలు పౌరులను క్రమం తప్పకుండా పొదుపు చేసేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం నిర్వహించే పొదుపు సాధనాలు. చిన్న పొదుపు పథకాలు మూడు విభాగాలుగా ఉంటాయి. పొదుపు డిపాజిట్లు, సామాజిక భద్రతా పథకాలు, నెలవారీ ఆదాయ ప్రణాళిక విభాగాలుగా ఈ పొదుపు పథకాలు ఉంటాయి. పొదుపు డిపాజిట్లలో 1 నుంచి 3 సంవత్సరాల టైమ్ డిపాజిట్లు, 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు ఉంటాయి. వీటిలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (ఎన్‌ఎస్‌సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) వంటి పొదుపు ధ్రువపత్రాలు కూడా ఉన్నాయి. సామాజిక భద్రతా పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), సుకన్య సమృద్ధి ఖాతా, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఉన్నాయి. నెలవారీ ఆదాయ ప్రణాళికలో నెలవారీ ఆదాయ ఖాతా ఉంటుంది.

ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా..

  • సేవింగ్స్ డిపాజిట్: 4 శాతం
  • 1-సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 6.9 శాతం
  • 2-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.0 శాతం
  • 3-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7 శాతం
  • 5-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.5 శాతం
  • 5-సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు: 6.5 శాతం
  • నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (ఎన్‌ఎస్‌సీ): 7.7 శాతం
  • కిసాన్ వికాస్ పత్ర: 7.5 శాతం (115 నెలల్లో మెచ్యూర్ అవుతుంది)
  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: 7.1 శాతం
  • సుకన్య సమృద్ధి ఖాతా: 8.0 శాతం
  • సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2 శాతం
  • నెలవారీ ఆదాయ ఖాతా: 7.4 శాతం.

జూన్‌లో పెంపు

జూన్ 30, 2023న జరిగిన చివరి సమీక్షలో ప్రభుత్వం అనేక చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచింది. ముఖ్యంగా సంవత్సరం నుంచి 2-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు, 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంఆచరు. ముఖ్యంగా 2020-21 రెండవ త్రైమాసికం నుంచి వరుసగా తొమ్మిది త్రైమాసికాల వరకు మారకుండా ఉంచిన తర్వాత అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికానికి ప్రభుత్వం కొన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచిన తర్వాత సెప్టెంబర్ 2022 నుంచి ఇది నాలుగో పెంపు అని నిపుణులు పేర్కొంంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి