FD Interest Rates: పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై ఏకంగా 9 శాతం వడ్డీ ఆఫర్

|

Jun 26, 2023 | 9:00 PM

కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పటికీ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతానికి పైగా వడ్డీ రేట్లను అందజేస్తున్నాయి. సీనియర్ సిటిజన్ ఎఫ్‌డిలపై 9 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను బ్యాంకుల కంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అలాగే సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. అయితే బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్ల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నప్పటికీ ఇందులో డిపాజిట్లకు కేవలం రూ.5 లక్షల వరకే ఇన్సూరెన్స్ పరిమితి ఉందని గమనించాలి.

FD Interest Rates: పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై ఏకంగా 9 శాతం వడ్డీ ఆఫర్
Fixed Deposit
Follow us on

భారతదేశంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే పొదుపు మంత్రం బాగా పాటిస్తారు. ముఖ్యంగా నమ్మకమైన రాబడి వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. అయితే ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా గతేడాది నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి) వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగాయి. కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఇప్పటికీ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతానికి పైగా వడ్డీ రేట్లను అందజేస్తున్నాయి. సీనియర్ సిటిజన్ ఎఫ్‌డిలపై 9 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను బ్యాంకుల కంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అలాగే సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. అయితే బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్ల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నప్పటికీ ఇందులో డిపాజిట్లకు కేవలం రూ.5 లక్షల వరకే ఇన్సూరెన్స్ పరిమితి ఉందని గమనించాలి. కాబట్టి రూ.5 లక్షల వరకూ పెట్టుబడి ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో పెట్టుబడి ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 9 శాతం కంటే ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకుల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎంపిక చేసిన కాల వ్యవధిలో సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది. 181-201 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీల కోసం, సీనియర్ సిటిజన్‌లకు బ్యాంక్ 9.25 శాతం వడ్డీని అందిస్తుంది. 501 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై, సీనియర్ సిటిజన్లు 9.25 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు 1001 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలకు 9.5 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. 

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 

సీనియర్ సిటిజన్లు 1000 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.11 శాతం వడ్డీ రేటును పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డిలు

సీనియర్ సిటిజన్‌లు జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లలో ఎంపిక చేసిన పదవీకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం వడ్డీ రేటును కూడా పొందవచ్చు. 366-499 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యేఎఫ్‌డీల కోసం, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు 9 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 501-730 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలకు 9 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 500 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 9 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం సీనియర్ సిటిజన్‌లకు 9.6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో 999 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలకు 9 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 

ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీలపై 9 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం