Hero Glamour 125: హీరో గ్లామర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సూపర్ క్రేజీ అప్‌డేటెడ్ వెర్షన్ రిలీజ్

|

Aug 24, 2024 | 11:18 PM

ఇటీవల కాలంలో భారతదేశ ఆటోమొబైల్ రంగంలో బడ్జెట్ బైక్స్ సూపర్ ఫీచర్స్‌తో అందరినీ ఆకర్షిస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే స్పోర్టీ లుక్‌తో బైక్ కావాలనుకునే వారి సంఖ్య క్రమేపి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఫీచర్స్‌తో హీరో కంపెనీ రిలీజ్ చేసిన గ్లామర్ బైక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రతి ఏటా ఈ బైక్‌ను సూపర్ ఫీచర్స్‌తో అప్‌డేట్ చేస్తూ ఉండడంతో బడ్జెట్ ప్రియుల మొదటి ఆప్షన్‌గా హీరో నిలుస్తుంది.

Hero Glamour 125: హీరో గ్లామర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సూపర్ క్రేజీ అప్‌డేటెడ్ వెర్షన్ రిలీజ్
Hero Glamour
Follow us on

ఇటీవల కాలంలో భారతదేశ ఆటోమొబైల్ రంగంలో బడ్జెట్ బైక్స్ సూపర్ ఫీచర్స్‌తో అందరినీ ఆకర్షిస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే స్పోర్టీ లుక్‌తో బైక్ కావాలనుకునే వారి సంఖ్య క్రమేపి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఫీచర్స్‌తో హీరో కంపెనీ రిలీజ్ చేసిన గ్లామర్ బైక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రతి ఏటా ఈ బైక్‌ను సూపర్ ఫీచర్స్‌తో అప్‌డేట్ చేస్తూ ఉండడంతో బడ్జెట్ ప్రియుల మొదటి ఆప్షన్‌గా హీరో నిలుస్తుంది. తాజాగా  గ్లామర్ బైక్‌ను హీరో కంపెనీ మరోసారి అప్‌డేట్ చేసింది. తాజాగా అప్‌డేటెడ్ వెర్షన్ బైక్ న్యూ బ్లాక్ మెటాలిక్ సిల్వర్ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.83,598 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.87,598 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హీరో గ్లామర్ 125 బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

2024 హీరో గ్లామర్ ప్రస్తుత వెర్షన్ డిజైన్, ఫీచర్లపరంగా ఎలాంటి అప్‌డేట్ లేకపోయినా న్యూ కలర్ వేరియంట్‌ను మాత్రం కంపెనీ రిలీజ్ చేసింది. ప్రస్తుత కలర్స్‌ అయిన కాండీ బ్లేజింగ్ రెడ్, బ్లాక్ స్పోర్ట్స్ రెడ్, బ్లాక్ టెక్నో బ్లూతో పాటు నయా కలర్ వేరియంట్‌లో కూడా ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. ఈ బైక్‌లో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, హజార్డ్ లైట్లు, స్టార్ట్/స్టాప్ స్విచ్ వంటి ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. 2024 హీరో గ్లామర్ 125 అన్ని టెల్-టేల్ లైట్లతో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది. ముఖ్యంగా ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి బైక్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, హీరోకు స్మార్ట్ సిస్టమ్ ఐ3ఎస్ లేదా ఆటో స్టార్ట్/స్టాప్‌తో పాటుగా వస్తుంది. 2024 గ్లామర్ పై పవర్ అదే 125 సీసీ సింగిల్-సిలిండర్, 10.68 బీహెచ్‌పీ, 10.6 ఎన్ఎం గరిష్ట టార్క్ కోసం ట్యూన్ చేయబడిన ఎయిర్-కూల్డ్ మోటార్ ఆకట్టుకుంటుంది. 

హీరో గ్లామర్ 2024 ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపున ట్వీన్ షాక్ అబ్జార్బర్స్ పై నడుస్తుంది. బ్రేకింగ్ పనితీరు టాప్ వేరియంట్లో ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్ సెటప్ ఆకట్టుకుంటుంది. అలాగే అయితే ఎంట్రీ-లెవల్ వేరియంట్ డ్యూయల్ డ్రమ్ బ్రేక్లతో వస్తుంది. 2024 హీరో గ్లామర్ హెూండా షైన్ 125, బజాజ్ పల్సర్ 125, టీవీఎస్ రైడర్ 125, బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్‌లు గట్టి పోటీనిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి