ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. ప్రయాణికులు ఇబ్బందులకు గురవకుండా మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది రైల్వే. అయితే ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుందని ఇండియన్ రైల్వే. తక్కువ ధరల్లోనే ప్రయాణికులకు ఫుడ్, నీటి సదుపాయం కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంది. జనరల్ కోచ్‌ల్లో ప్రయాణించే వారి కోసం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రైలు ఆయా స్టేషన్‌లలో నిలిపే చోట ప్లాట్‌ఫామ్‌పై ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచనున్నట్లు భారత రైల్వే తెలిపింది.
అయితే జనరల్ కోచ్ ఆహార పదార్థాలను రెండు కేటగిరిలుగా విభజించింది. 7 పూరీలు, ఆలూ ఫ్రై, అవకాయ పికిల్‌తో కూడిన ప్యాక్‌ను కేవలం 20 రూపాయలకే అందించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక రెండో కేటగిరి విషయానికొస్తే ఫుడ్‌ను 50 రూపాయలకు అందించనుంది. ఈ ఫుడ్ ప్యాక్‌లో అన్నం, కిచిడీ, రాజ్మా, పావ్ బాజీ, దోశ వంటివి ఉంటాయి. అయితే ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ బాటిల్ కూడా ఉంటుంది. అయితే తక్కువ ధరల్లోనే ప్రయాణికులకు ఆహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. జనరల్ కోచ్‌లు ఉన్న రైళ్లలో రిజర్వేషన్ చేసుకోలేని వారు ప్రయాణిస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ సదుపాయాన్ని అందించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ముందుగా ఈ సేవలను ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సేవలు 51 రైల్వే స్టేషన్‌లలో ఏర్పాటు చేసింది రైల్వే. రానున్న రోజుల్లో మరిన్ని స్టేషన్‌లలో ఈ సేవలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది రైల్వే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి