Ather Rizta: ఆ నగరాల్లోని ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ ఏథర్ స్కూటర్ డెలివరీలు షురూ..

|

Jul 04, 2024 | 4:30 PM

తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ అయిన ఏథర్ ఎనర్జీ తన కొత్త రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆ కంపెనీ సీఈఓ తరుణ్ మెహతా ఈ మేరు తన ఎక్స్‌లో ఈ అప్‌డేట్ ఇచ్చారు. అయితే దేశంలోని కొన్ని నగరాల్లో ముందుగా ఈ స్కూటర్ డెలివరీలను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఏథర్ రిజ్టా ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేశారు.

Ather Rizta: ఆ నగరాల్లోని ఈవీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ ఏథర్ స్కూటర్ డెలివరీలు షురూ..
Ather Rizta
Follow us on

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల దగ్గర స్టార్టప్ కంపెనీల వరకూ ప్రతి కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌లో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ అయిన ఏథర్ ఎనర్జీ తన కొత్త రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆ కంపెనీ సీఈఓ తరుణ్ మెహతా ఈ మేరు తన ఎక్స్‌లో ఈ అప్‌డేట్ ఇచ్చారు. అయితే దేశంలోని కొన్ని నగరాల్లో ముందుగా ఈ స్కూటర్ డెలివరీలను అందిస్తున్నట్లు ప్రకటించారు. ఏథర్ రిజ్టా ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేశారు. ఈ స్కూటర్ ధర రూ.1.10 లక్షల నుంచి రూ.1.45 లక్షల వరకు ఉంటుంది. ఈ స్కూటర్‌ను మొదటగా అహ్మదాబాద్, పూణే, ఢిల్లీ, లక్నో, ఆగ్రా, జైపూర్, నాగ్ పూర్, ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న నగరాల్లో డెలివరీలు అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఏథర్ రిజ్టా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఏథర్ రిజ్టా  450 ఎక్స్‌లా ప్రధాన ఫ్రేమ్ అలాగే ఉన్నప్పటికీ తక్కువ సీటు ఎత్తుతో వచ్చే సబ్ ఫ్రేమ్ ఆకట్టకుంటుంది. పీఎంఎస్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వచ్చే ఈ స్కూటర్ 80 కిలో మీటర్ల గరిష్ట వేగంతో 3.7 సెకన్లలో 0-40 కిలో మీటర్లను అందుకుంటుంది. రిజ్టా 2.9 కేడబ్ల్యూహెచ్ యూనిట్‌తో 123 కిమీ పరిధిని అందిస్తుంది. అలాగే 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చే వేరియంట్ ఓ సారి ఛార్జ్ చేస్తే 159 కిమీ పరిధితో వస్తుంది.  ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు ఒకే షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. బ్రేకింగ్ పవర్ విషయానికి వస్తే ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్ సెటప్ నుండి వస్తుంది.

ఏథర్ రిజ్టా స్కూటర్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో ఆకట్టుకుంటుంది. జెడ్ వేరియంట్లు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌తో టీఎఫ్‌టీ స్క్రీన్‌తో వస్తాయి. ట్రిమ్ కూడా ప్రామాణిక సీటును పొందుతుంది. అయితే జెడ్ ట్రిమ్ దానిని ప్రీమియం సీటుతో పాటు స్టాండర్డ్ పొందుతుంది. 2.9 కేడబ్ల్యూహెచ్ వెర్షన్లలో ఛార్జింగ్ సమయం 5 గంటల 45 నిమిషాలు ఉంటుంది. అయితే 3.7 కేడబ్ల్యూహెచ్ వెర్షన్ వేగంగా ఛార్జింగ్ అవుతుంది మరియు 4 గంటల 30 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఏథర్ రిజ్టా ఎస్ ధర రూ. 1.10 లక్షల నుంచింది. అయితే ఫ్యాన్సీయర్ ఫీచర్లతో కూడిన ప్రో ప్యాక్ ఎక్స్-షోరూమ్ ధర కంటే 13,000, అంతకంటే ఎక్కువ ప్రీమియంతో వస్తుంది . రిజ్టా జెడ్ వేరయంట్ 2.9  కేడబ్ల్యూహెచ్ ధర రూ.1.25 లక్షలు, రిజ్జా జెడ్ 3.7 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ.1.45 లక్షలుగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..