Honda EV Scooters: ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. రెండు ఈవీ స్కూటర్లను లాంచ్ చేసిన హోండా

|

Nov 29, 2024 | 3:50 PM

భారతదేశంలో ఈవీ వాహనాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు నయా ఈవీలను మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ హోండా ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. యాక్టివాఈ, క్యూసీ1 పేరుతో లాంచ్ చేసి ఈ స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీ సెటప్‌తో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Honda EV Scooters: ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. రెండు ఈవీ స్కూటర్లను లాంచ్ చేసిన హోండా
Honda Ev Scooter
Follow us on

హోండా యాక్టివా అంటే మధ్య తరగతి ప్రజలు అధికంగా ఇష్టపడే స్కూటర్ ఇప్పుడు యాక్టివా ఈ పేరుతో యాక్టివా ఈవీ వెర్షన్‌ను హోండా లాంచ్ చేసింది. చూడడానికి అచ్చం యాక్టివా ఐసీఈ స్కూటర్ మాదిరిగా ఉన్నా స్టైలింగ్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ మినిమలిస్టిక్ విధానంలో ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఇరువైపులా టర్న్ ఇండికేటర్‌లతో ఉంటుంది. హోండా యాక్టివా పొడవాటి సీటుతో చిన్న ఫ్లోర్‌బోర్డ్‌ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది.

ముఖ్యంగా యాక్టివా ఈ రిమూవబుల్ బ్యాటరీ సెటప్‌తో రెండు 1.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలతో వస్తుంది. అందువల్ల చార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ యూనిట్ల ద్వారా శక్తి వీల్-సైడ్ ఎలక్ట్రిక్ మోటారుకు బదిలీ అవుతుంది. ఇది 4.2 కేడబ్ల్యూ పవర్ అవుట్‌పుట్‌ని కలిగి ఉంటుంది. ఈ అవుట్‌పుట్ గరిష్టంగా 6.0 కేడబ్ల్య వరకు పెంచుకోవచు. హోండా యాక్టివా-ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 102 కిమీల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఈ స్కూటర్‌లో స్టాండర్డ్, స్పోర్ట్, ఎకాన్ వంటి రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. 

హోండా క్యూసీ-1

హోండా క్యూసీ-1 భారతదేశంలో 2025 మధ్యలో నుంచి ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు. ముఖ్యంగా తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికుల ఈ స్కూటర్ రూపొందించారు. ఈ స్కూటర్ కూడా యాక్టివా-ఈ డిజైన్ మాదిరిగా ఉన్నాయి. ఈ స్కూటర్ ఆప్రాన్, వాహనానికి సంబంధించిన సైడ్ ప్యానెల్‌లు ఆకట్టుకుంటాయి.అయితే యాక్టివా-ఈ మాదిరి డీఆర్‌ఎల్‌లు లేకపోవడంతో స్కూటర్ కొంచెం భిన్నంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

క్యూసీ – 1 స్థిరమైన 1.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఫ్లోర్‌బోర్డ్‌పై ఉంచిన సాకెట్ ద్వారా స్కూటర్‌కు కనెక్ట్ చేసేలా ప్రత్యేక ఛార్జర్‌తో వస్తుంది. క్యూసీ-1 స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 80 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. క్యూసీ-1 ఐదు అంగుళాల ఎల్‌సీడీ  ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ ఈవీ స్కూటర్‌లో అండర్-సీట్ స్టోరేజ్, యూఎస్‌బీ టైప్-సీ సాకెట్ వంటి అధునాతన ఫీచర్లు ఆకట్టుకుంటాయి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి