ఈ మధ్యే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటును పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని బ్యాంకులు కూడా తమ వడ్డీ రేటును పెంచుతున్నట్లు ప్రకటించాయి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు రెపోరేటును 25బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు RBIవెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకు కస్టమర్లకు ఇచ్చే లోన్లపై నేరుగా ప్రభావం పడుతోంది. అయితే రిజర్వ్ బ్యాంకు రెపోరేటును పెంచినాకూడా…కెనరా బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. లోన్ వడ్డీ రేటును 0.15శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటును సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు ఫిబ్రవరి 12 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
కాగా ప్రస్తుతం కెనరా బ్యాంకు RLLR9.40శాతం ఉంది. తాజా తగ్గింపుతో 9.25శాతానికి చేరింది. రిజర్వ్ బ్యాంకు రెపోరేటును ప్రకటించిన వెంటనే పంజాబ్ నేషన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాకూడా లోన్ వడ్డీ రేట్లను 25బేసిస్ పాయింట్ల వరకు పెంచాయి. కెనరా బ్యాంక్ మాత్రం 15బేసిస్ పాయింట్లు తగ్గించడం విశేషం.
అంతకుముందు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఎంసీఎల్‌ఆర్ రేట్లను 0.25 శాతం పెంచడంతో.. 8.85 శాతానికి చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఒకరోజు ఎంసీఎల్‌ఆర్ రేటును 8.30 శాతం నుంచి 8.50 శాతానికి పెంచింది. ఒక నెల ఎంసీఎల్‌ఆర్ అంతకుముందు 8.30 నుంచి 8.55 శాతానికి, ఒక సంవత్సరం ఎంసీఎల్‌ఆర్ నుంచి 8.85 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఇది 8.60 శాతంగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి