Cooking Oil Price: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న వంట నూనె ధరలు.. ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు!

|

Mar 30, 2022 | 8:25 AM

Cooking Oil Price: ప్రస్తుతం వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల కారణంగా వంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉక్రెయిన్‌..

Cooking Oil Price: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న వంట నూనె ధరలు.. ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు!
Follow us on

Cooking Oil Price: ప్రస్తుతం వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల కారణంగా వంట నూనె ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉక్రెయిన్‌ నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్‌ ధరలు (Oil Price).. యుద్ధాల కారణంగా ఆకాశానికి ఎగబాకాయి. దీంతో ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టాస్క్‌ఫోర్స్‌తో ధరలపై నిఘా, ఆకస్మిక తనిఖీలు, రైతు బజార్లు, మున్సిపల్‌ మార్కెట్లలో కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే విజయ ఆయిల్స్‌ ఫలితంగా వంట నూనె ధరలు దిగి వస్తున్నాయి. ఎమ్మార్పీ ధరల (MRP Rates) కంటే దాదాపు రూ.5 నుంచి రూ.55 వరకు తగ్గించి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు కూడా మంచి ఫలితాలిస్తున్నాయి.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల (Ukraine-Russia war) కారణంగా అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు పరుగులు పెట్టడంతో దేశీయంగా వ్యాపారులు వంట నూనెల కృత్రిమ కొరత సృష్టించారు. దీంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. జనవరి నెలలో లీటర్‌ రూ.150 నుంచి రూ.175 మధ్య ఉండగా, ఒకేసారి రూ.200వరకు దాటిపోయింది. ఇతర ఆయిల్స్‌ అయితే రూ.200 నుంచి రూ.265 వరకు పెంచేశారు. ఇలా ధరలు పరుగులు పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. స్టాక్‌ పరిమితిపై ఆంక్షలు విధించింది. హోల్‌సేల్‌, రిటైల్‌ షాపుల్లో విస్తృత తనిఖీలు చేపట్టింది.

ఏపిలో రైతు బజార్లు, మున్సిపల్‌ మార్కెట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వాటిలో విజయ ఆయిల్స్‌ తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మార్కెట్లో స్వాధీనం చేసుకున్న నూనెలను కూడా ఈ కౌంటర్లలో విక్రయిస్తోంది. ఇలా చేయడం వల్ల గత పదిహేను రోజుల్లో 61,759 లీటర్లు విక్రయించింది. ఈ చర్యలతో ఎమ్మార్పీ కంటే రూ.55 వరకు తగ్గించి విక్రయించేందుకు వ్యాపారులు ముందుకు వచ్చారు. సామాన్యుడికి ఇబ్బందిగా మారుతున్న వంటనూనె ధరలు అదుపులోకి వచ్చేంత వరకు ఇలాగే చర్యలు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం పామాయిల్‌ విషయానికొస్తే మార్కెట్లో రూ.175 విక్రయిస్తున్నారు. ప్రభుత్వం పామాయిల్‌ లీటర్‌ రూ.150కే విక్రయించాలని నిర్ణయించింది.

మంగళవారం నుంచి రైతు బజార్ల ద్వారా వీటిని విక్రయిస్తున్నారు. విజయం రిఫైన్డ్‌ ఆయిల్‌ రూ.178, వేరుశనగ, రైస్‌బ్రాన్‌ ఆయిల్స్‌ రూ.170కే అందుబాటులో ఉంచింది. ఇక ఏపీ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌తో మార్కెట్లో ధరలపై ప్రత్యేక నిఘా పెట్టింది. హోల్‌సేల్‌, రిటైల్‌ షాపుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించింది. గుంటూరు, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాల్లోని ప్రధాన నగరాల్లో 75 మందికిపైగా వ్యాపారులు, హోల్‌సేల్‌ వ్యాపారులపై కేసులు నమోదు చేసింది. 1802 టన్నులకుపైగా వివిధ రకాల నూనెలను స్వాధీనం చేసుకుంది. అధిక ధరలకు విక్రయించినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

1 April New Rules: కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు..!

Gas Cylinder Expiry Date: గ్యాస్‌ సిలిండర్‌కు ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుందని మీకు తెలుసా..? గుర్తించడం ఎలా..?