ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్ఓ) పరిధిలో ఉన్న సుమారు 6 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఉద్యోగుల ఖాతాల్లోకి 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.5 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ త్వరలోనే జమ చేయనుంది. ఈ ప్రతిపాదనకు కార్మిక మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జూలై జూలై చివరి నాటికి వడ్డీని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కానున్నాయని సమాచారం.
గత 2019-20 ఆర్థిక సంవత్సరంలో, చాలామంది ఈపీఎఫ్ఓ చందాదారులకు 8 నుండి 10 నెలల ఆలస్యంగా వడ్డీ చెల్లింపులు జరిగాయి. అంతకుముందు, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే, ఇది గత ఏడు సంవత్సరాలలో భారతదేశ సామాజిక భద్రతా సంస్థ అందించిన అతి తక్కువ వడ్డీ రేటు అని చెప్పవచ్చు. అలాగే ఈ క్లిష్ట సమయంలో చందాదారులకు మద్దతుగా నాన్ రిఫండబుల్ కోవిడ్-19 అడ్వాన్స్ అమౌంట్‌ను ఉపసంహారించుకునేందుకు అనుమతి ఇచ్చిన విషయం విదితమే.
ఎఫ్‌వై 14 నుండి, ఈపీఎఫ్ఓ స్థిరంగా 8.5 శాతానికి పైగా రాబడిని సంపాదించింది. అధిక ఈపీఎఫ్ వడ్డీ రేటు సమ్మేళనంతో పాటు చందాదారుల లాభాలకు గణనీయమైన వ్యత్యాసాన్ని ఇస్తుంది. ఈపీఎఫ్ఓ స్థిరంగా పెట్టుబడుల పట్ల సాంప్రదాయక విధానాన్ని అనుసరించి, సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది. అలాగే పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును స్థిరంగా ఉంచాలని ప్రకటించిన తరువాత కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన ద్వారా పైన పేర్కొన్న విషయాలను వెల్లడించింది.
బాల్కానీలో దంపతుల ఫైట్.. అంతలోనే ఘోరం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!
తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
ప్రపంచంలోనే వింతైన వంటకాలు.. చూస్తేనే వాంతి వస్తుంది.. తినడానికి కూడా ధైర్యం చెయ్యరు.!