భారతదేశంలో బంగారం కొనడం శుభప్రదంతో పాటు పెట్టుబడికి చాలా ప్రసిద్ధి చెందింది. ఇది వివాహాలు, పుట్టినరోజులు లేదా ఏదైనా పెద్ద పండుగకు బహుమతిగా కూడా ఇస్తుంటారు. అలాగే మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. భారతీయ మహిళలకు బంగారు ఆభరణాలపై భిన్నమైన క్రేజ్ ఉంది. బంగారం చాలా ఖరీదైనది. చాలా మంది దానిని సురక్షితంగా ఉంచడానికి బ్యాంక్ లాకర్లను ఉపయోగిస్తారు. కానీ, చాలామంది దీన్ని ఇంట్లోనే ఉంచుకుంటారు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచవచ్చనే నియమం చాలా మందికి ఇప్పటికీ తెలియదు (భారతదేశంలో గోల్డ్ స్టోర్ రూల్). పరిమితికి మించి బంగారం ఇంట్లో ఉంచుకుంటే దానికి లెక్క చెప్పాల్సిందే.
ఇది కూడా చదవండి: Hallmarking: ఇప్పుడు ఈ 18 రాష్ట్రాల్లో హాల్‌మార్క్ లేని ఆభరణాలు విక్రయించలేరు.. నిబంధనలు అమలు!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం.. ఇంట్లో పరిమితికి మించి బంగారం ఉంటే, దాని గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలి. అదే సమయంలో ఇంట్లో ఉంచిన బంగారానికి సంబంధించిన రుజువు కూడా ఉండాలి. రుజువుగా బంగారం ఎక్కడ నుండి కొనుగోలు చేయబడింది లేదా ఎవరు బహుమతిగా ఇచ్చారో పేర్కొనాలి. CBDT సర్క్యులర్ ప్రకారం, ఏదైనా బంగారం లేదా బంగారు ఆభరణాలు వారసత్వంగా వచ్చినట్లయితే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలను విక్రయిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అదే సమయంలో ఒక వ్యక్తి ఏదైనా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి మూడేళ్లలోపు విక్రయిస్తే, అతను స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత బంగారాన్ని అమ్మితే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి.
ఇది కూడా చదవండి: BSNL: జియో కంటే మరింత తక్కువ.. 70 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్‌ఎన్‌ఎల్ బెస్ట్ ప్లాన్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి