Gold-Silver Price: మహిళలకు బ్యాడ్‌ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..

|

Aug 02, 2023 | 7:07 AM

ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంక్‌లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు పెరగడం లేదా తగ్గడం వంటి అంశాలు కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర ఈరోజు మళ్లీ పెరిగింది. వ్యాపార రాజధాని ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 55,400, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,440లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold-Silver Price: మహిళలకు బ్యాడ్‌ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు.. ఎలా ఉన్నాయంటే..
Gold Silver Price
Follow us on

Gold-Silver Price: ఇటీవల బంగారం, వెండి ధరలలో సాధారణ ట్రెండ్ కొనసాగుతోంది. పసిడి ధర ఒకరోజు పెరుగుతుంది. మరో రోజు తగ్గుతుంది. శ్రావణం మాసం కావటంతో బంగారం కొనాలని అనుకొనే వారు ఎక్కువగానే ఉంటారు. అయితే, పసిడి ప్రియులు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే బంగారం ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. గత మూడు నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర ఈరోజు మళ్లీ పెరిగింది. దేశంలో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5,540గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.6,044గా ఉంది. గ్రాము వెండి రూ.76.50. నిన్నిటితో పోలిస్తే.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర పై 150 రూపాయిలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయిలు పెరిగి 60,440 గా ఉంది. ఇక వెండి కూడా కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 81000 గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

* వ్యాపార రాజధాని ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 55,400, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,440లుగా ఉంది.

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 55,550, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,570గా ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 55,700, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రూ. 60,760వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ. 55,400, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 60,440 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 55,400కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ. 60,440గా ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 55,400, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 60,440 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 55,400, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 60,440 వద్ద కొనసాగుతోంది.

* వరంగల్‌లో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 55,440కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 60,440 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భారతదేశంలో వెండి ధర అంతర్జాతీయ ధరల ద్వారా నిర్ణయించబడుతుంది. అది కూడా డాలర్‌తో రూపాయి మారకం కరెన్సీ కదలికపై ఆధారపడి ఉంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం, అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉంటే, వెండి మరింత ఖరీదవుతుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బుధవారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

– ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,000

– ముంబైలో రూ. 78,000

– బెంగళూరులో రూ. 76,500,

– హైదరాబాద్‌లో రూ. 81,000

– విజయవాడలో రూ. 81,000 వద్ద కొనసాగుతోంది.

ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంక్‌లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు పెరగడం లేదా తగ్గడం వంటి అంశాలు కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..