Gold Silver Price Today: మహిళలకు షాకింగ్‌.. భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

|

Mar 10, 2022 | 6:16 AM

Gold Silver Price Today: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాలు ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వివిధ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇక బంగారం విషయానికొస్తే భారతీయులు (Indians)పసిడికి..

Gold Silver Price Today: మహిళలకు షాకింగ్‌.. భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు
Follow us on

Gold Silver Price Today: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాలు ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వివిధ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇక బంగారం విషయానికొస్తే భారతీయులు (Indians)పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. ప్రస్తుతం దేశంలో బంగారం (Gold) ధరలు దూసుకుపోతున్నాయి. తాజాగా గురువారం (మార్చి10)న దేశంలో బంగారం, వెండి (Silver Rate) ధరలు మరింత పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 400లకుపైగా ఎగబాకింది ఇక వెండి ధర కూడా పరుగులు పెట్టింది. కిలో బంగారంపై రూ.13,000 వరకు పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,303, ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.50,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,770, అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.54,330 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,330 ఉంది.

వెండి ధరలు

వెండి ధరల విషయానికొస్తే దేశీయంగా కిలో బంగారం ధరపై రూ.1300 వరకు ఎగబాకింది. తాజాగా ఢిల్లీలో కిలో బంగారం ధర రూ.71,200 ఉండగా, ముంబైలో రూ.71,200 ఉంది. ఇక చెన్నైలో కిలో బంగారం ధర రూ.76,700 ఉండగా, కోల్‌కతాలో రూ.71,200 ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.76,700 ఉండగా, కేరళలో రూ.76,700 ఉంది. హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.76,700 ఉండగా, విజయవాడలో రూ.76,700 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో భారత్ ఆటో పరిశ్రమకు మంచి అవకాశం ఎందుకంటే..

DCGI: కోవోవాక్స్‌ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన డీసీజీఐ.. ఈ టీకా పిల్లల కోసమేనట.!