Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఉదయం నిలకడగా ఉన్నా… సాయంత్రం ఎగబాకింది.. వెండి కూడా అదే బాటలో..

|

Apr 19, 2021 | 9:26 PM

Gold Silver Rate Today: బులియన్‌ మార్కెట్లో పసిడి పరుగులు పెడుతోంది. ఏప్రిల్‌ 1 నుంచి రాకెట్‌ల దూసుకుపోతున్న బంగారం.. సోమవారం కూడా పెరిగింది. ఉదయం కాస్త నిలకడగా ఉన్న..

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఉదయం నిలకడగా ఉన్నా... సాయంత్రం ఎగబాకింది.. వెండి కూడా అదే బాటలో..
Gold Price Today
Follow us on

Gold Silver Rate Today: బులియన్‌ మార్కెట్లో పసిడి పరుగులు పెడుతోంది. ఏప్రిల్‌ 1 నుంచి రాకెట్‌ల దూసుకుపోతున్న బంగారం.. సోమవారం కూడా పెరిగింది. ఉదయం కాస్త నిలకడగా ఉన్న బంగారం.. సాయంత్రం వచ్చే సరికి పెరిగింది. ఇందుకు కారణం కరోనా కేసులు భారీగా పెరగడమేనని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది కూడా కరోనా సమయంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో దూసుకుపోతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, ఇండియన్‌ జ్యువెల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,917 నుంచి రూ.47,555లకు చేరుకుంది.అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,976 నుంచి రూ.43,560కి చేరుకుంది. అంటే ఒక్క రోజే సుమారు రూ.600 వరకు పెరిగింది.

ఇక హైదరాబాద్‌లో మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.44,160 ఉండగా, సాయంత్రం వరకు 44,250కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,170 నుంచి రూ.48,270కి చేరుకుంది. అయితే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఎలాంటి మార్పు లేదు. ఇకపోతే వెండి ధర కూడా పరుగులు పెట్టింది. కిలో వెండి ధర రూ.68,600 నుంచి రూ.69,200కు పెరిగింది. అయితే బంగారం కొనుగోలు చేసేవారు ఆ సమయానికి ఏ ధరలు ఉన్నాయో తెలుసుకుని వెళ్లాలని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.

అయితే బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా..? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇందుకు దేశంలో కరోనా వ్యాప్తి కారణమనే చెబుతున్నారు. గత రెండు నెలలుగా స్టాక్‌ మార్కెట్లు పెద్దగా ప్రయోజనం కలిగించడం లేదు. పెట్టుబడులను వేరే వాటిపైన మళ్లించాలని చూస్తున్నారు. కొంత మంది బిట్‌కాయిన్‌, డాలర్‌ కరెన్సీ వైపు మళ్లిస్తున్నారు. ఇప్పుడు వారికి బంగారంపై నిఘా ఉంది. క్రమ క్రమంగా పసిడి ధరలు పెరుగుతుంటే దానిపై పెట్టుబడి పెడుతున్నారు. తద్వారా త్వరలోనే మంచి రిటర్న్స్ వస్తాయనే అంచనాతో ఉన్నారు. అందుకే ఏప్రిల్‌ 1 నుంచి బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. దేశంలో కరోనా తగ్గే వరకూ ఈ ట్రెండ్ కొనసాగవచ్చనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి: Jio Plans: జియో నుంచి అదిరిపోయే ఆఫర్‌.. 1 జీబీ డేటాకు కేవలం రూ.3.5 మాత్రమే… పూర్తి వివరాలివే..!

SBI Customers: ఎస్‌బీఐ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్‌.. రూ. 10వేలకు రూ.520 ఈఎంఐ.. ప్రాసెసింగ్‌ ఫీజు ఫ్రీ…

RBI Auction: ఆర్బీఐ కీలక నిర్ణయం… రూ. 14వేల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీ వేలం రద్దు… అధిక ధరలకు అమ్మాలని ట్రేడర్ల డిమాండ్‌