Gold Silver Price: గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. తాజాగా పసిడి ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ పెరగడంతో పాటు అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు కొంతమేర తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.126 తగ్గి రూ.49,960కి చేరుకుంది. అంతకు ముందు రోజు మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 50,086 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇదే సమయంలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. నిన్న.. 63,916 ఉండగా.. ఇవాళ కిలోవెండి ధర రూ. 63,936 గా ఉంది. అంటే రూ. 20 పెరిగిందన్నమాట.
ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసలు కోలుకుని 74.59 వద్ద కొనసాగుతోంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ ప్రకారం.. రూపాయి విలువ పెరగడంతో పాటు, కామెక్స్‌లో బంగారం ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు రూ. 126 తగ్గిందని పేర్కొన్నారు. ఇక గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు ఔన్స్‌కు 1,886 డాలర్లకు పడిపోయాయి. అదే సమయంలో వెండి ధరలు పెరిగాయి. వెండి ఔన్స్‌కు 24.11 డాలర్లు పెరిగింది.
Also read:
TDP: సామాన్యులకు శ్రీవారిని దూరం చేస్తున్నారు.. టీటీడీ పాలక మండలి తీరుపై పయ్యావుల విమర్శలు..
విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారి నుంచి వేల కోట్లు కట్టించాం.. సుప్రీం కోర్టుకు కేంద్రం వివరణ
Telangana: ఆ కీచకులను చెప్పుతో కొట్టండి.. గుండెలు పిండేస్తున్న యువతి సూసైడ్ లెటర్..