Gold Silver Price Today: భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

|

Mar 23, 2022 | 6:18 AM

Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి..

Gold Silver Price Today: భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Gold Silver Price
Follow us on

Gold Silver Price Today: బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. భారతీయులు అత్యంత ప్రాధాన్యతనిచ్చే బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇక ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధాల (Ukraine-Russia War) కారణంగా భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం (March 23) బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగాయి. 10 గ్రాముల ధరపై రూ.350కిపైగా పెరిగింది. కాగా, బంగారం (Gold), వెండి (Silver) ధరల్లో రోజులో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. తాజాగా దేశీయంగా ధరల (Rate) వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1. చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,280 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.52,670 వద్ద నమోదవుతోంది.
  2. ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వద్ద ఉంది.
  3. ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధరలు రూ.52,100 ఉంది.
  4. కోల్‌కతా: 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,100 ఉంది.
  5. బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,100 ఉంది.
  6. హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 వద్ద ఉంది.
  7. విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 ఉంది.
  8. కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 వద్ద ఉంది.

వెండి ధరలు:

ఇక బంగారం లాగే వెండి కూడా పరుగులు పెడుతోంది. దేశీయంగా కిలో బంగారంపై 600లకుపైగా పెరిగింది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా, ముంబైలో రూ.68,300 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,300 ఉండగా, కోల్‌కతాలో రూ.68,300 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా, హైదరాబాద్‌లో రూ.72,600 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,600 ఉండగా, కేరళలో రూ.72,600 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

Pan-Aadhaar Link: ముఖ్యమైన అలర్ట్‌.. మార్చి 31లోగా ఈ పని పూర్తి చేసుకోండి.. లేదంటే రూ.10వేల జరిమానా చెల్లించుకోవాల్సిందే

Zomato Food Delivery: జొమాటో కీలక నిర్ణయం.. 10 నిమిషాల్లోనే ఫుడ్‌ డెలివరీ