Gold Silver Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. భారీగా పెరిగిన రేట్లు

|

Jun 17, 2022 | 6:14 AM

Gold Silver Price Today: బంగారం కొనుగోలు చేసే మహిళలకు బ్యాడ్‌న్యూస్‌. దేశంలో పసిడి ధరలు పెరిగిపోతున్నాయి. దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్య..

Gold Silver Price Today: మహిళలకు షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. భారీగా పెరిగిన రేట్లు
Follow us on

Gold Silver Price Today: బంగారం కొనుగోలు చేసే మహిళలకు బ్యాడ్‌న్యూస్‌. దేశంలో పసిడి ధరలు పెరిగిపోతున్నాయి. దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు. తాజాగా 10 గ్రాముల పసిడిపై రూ.430 వరకు పెరుగగా, కిలో వెండిపై రూ.1150 వరకు పెరిగింది. అయితే బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. (జూన్‌ 17)న దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు..

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో వెండిపై రూ.1150 వరకు ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,150 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.66,000 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, చెన్నైలో రూ.66,000 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.61,150 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.66,000 ఉంది. ఇక కేరళలో రూ.66,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి