Gold ATM: బంగారు, వెండి కాయిన్స్ ఇచ్చే ఏటీఎం.. ఎక్కడో తెలుసా..

|

Dec 29, 2023 | 9:03 PM

ఏటీఎంలలో డబ్బులు తీసుకోవడం చూశారు. కొన్నిసార్లు తమ బంధు మిత్రులకు క్యాష్ డిపాజిట్ మిషన్లలో నగదును జమ కూడా చేశారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా బంగారాన్ని ఇచ్చే ఏటీఎం మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. అది కూడా మన హైదరాబాద్ నగరంలోనే మొట్టమొదటి సారిగా ప్రారంభించారు. దీనిని ఎలా ఆపరేట్ చేయాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Gold ATM: బంగారు, వెండి కాయిన్స్ ఇచ్చే ఏటీఎం.. ఎక్కడో తెలుసా..
Gold Atm
Follow us on

ఏటీఎంలలో డబ్బులు తీసుకోవడం చూశారు. కొన్నిసార్లు తమ బంధు మిత్రులకు క్యాష్ డిపాజిట్ మిషన్లలో నగదును జమ కూడా చేశారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా బంగారాన్ని ఇచ్చే ఏటీఎం మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. అది కూడా మన హైదరాబాద్ నగరంలోనే మొట్టమొదటి సారిగా ప్రారంభించారు. దీనిని ఎలా ఆపరేట్ చేయాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారంణంగా మనం ఏటీఎంలలో వెళ్ళి డెబిట్ కార్డులు ఉపయోగించి నగదును తీసుకుంటూ ఉంటాం. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి మనకు కావల్సినంత బంగారాన్ని తీసుకోవచ్చు. ఇలాంటి సరికొత్త సేవలను అందించేందుకు గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. ఈ గోల్డ్ ఏటీఎంలో 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకూ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. కేవలం క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారానే కాకుండా యూపీఐ పేమెంట్ ద్వారా కూడా బంగారాన్ని తీసుకోవచ్చు.

ఈ గోల్డ్ విత్ డ్రా ఏటీఎంను గోల్డ్ సిక్కా లిమిటెడ్ అనే సంస్థ అమీర్‎పేట మెట్రోస్టేషన్‎లో అందుబాటులో ఉంచింది. ఏటీఎంలో ఏవిధంగా అయితే నగదు ఉపసంహరణకు ఆప్షన్స్ ఉంటాయో అలాగే బంగారు నాణేలు తీసుకునేందుకు కూడా వివిధ ఆప్షన్లు ఉంటాయి. ఈ ఏటీఎం ద్వారా కేవలం బంగారు కాయిన్స్ మాత్రమే కాకుండా సిల్వర్ కాయిన్స్ కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఏటీఎంను ఆపరేట్ చేసే ముందు మనం ఎంత పరిమాణంలో కాయిన్ కొనుగోలు చేయాలన్నది నిర్ణయించుకోవాలి. ఇందులో 0.5, 1, 2, 5, 10, 20 గ్రాముల బంగారు నాణేలను మిషన్లో అందుబాటులో ఉంచుతారు. స్క్రీన్ మీద మనకు ఎంత బంగారం కావాలో ఆ ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటే బంగారు నాణేలు గలగలమని బయటకు వస్తాయి. ఈ గోల్డ్ ఏటీఎం ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 వరకూ తెరిచి ఉంటుంది. ఆ రోజు బంగారం ధరలకు అనుగుణంగా డెబిట్, క్రెడిట్, యూపీఐ అకౌంట్లలో డబ్బులు నిలువ ఉండాలి. అప్పుడే మనం బంగారు, వెండి నాణేలను తీసుకునేందుకు వీలు ఉంటుంది. ఈ పసిడి 99.99శాతం స్వచ్చమైనదిగా చెబుతున్నారు సంస్థ ప్రతినిధులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..