
కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రపంచ దేశాలు దివాళా తీశాయి. కాని, భారత్ మాత్రం నిలదొక్కుకుంది. కారణం.. ఇంటి ఇల్లాలి బంగారం అమ్మడం వల్లే. ఆలికి సింగారం అమ్మకానికి బంగారం అని ఊరికనే అనలేదు పెద్దవాళ్లు. సందర్భానికి తగ్గట్టు బంగారాన్ని అమ్మడమే కరెక్ట్. అలాగే.. పెట్టుబడి అవకాశం వచ్చినప్పుడు కూడా బంగారాన్ని తీస్తే తప్పేం లేదు. అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు బంగారాన్ని అమ్ముకోకపోవడమే తప్పు అంటుంటారు ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్. 1925లో పదిగ్రాముల బంగారం 18 రూపాయల 75 పైసలు. దేశ స్వాతంత్రం నాటికి అదే పది గ్రాముల బంగారం 88 రూపాయలు. 1959లో మొదటిసారి వంద రూపాయలు దాటింది పది గ్రాముల పసిడి. సరే.. లాంగ్ కూడా అక్కర్లేదు. 1980లలో చూడండి. పది గ్రాముల బంగారం వెయ్యి రూపాయలను టచ్ చేసింది. అంత ధర పలకడం చరిత్రలో అదే ఫస్ట్‌టైమ్. సో, చాలామంది ఇళ్లల్లో ఇప్పటికీ ఆనాటి బంగారమే ఉంటుంది. ఎన్నో మెరుగులు దిద్దుకుంటూ, కొత్త ఆభరణాలుగా మారుతూ వస్తోంది. మరి… ఆనాడు వెయ్యి రూపాయలకు కొన్న దాన్ని ఇవాళ లక్ష రూపాయలకు అమ్ముకుంటే లాభం కాదా? ఏకంగా వంద రెట్లు పెరిగింది బంగారం ధర. అమ్మితే కచ్చితంగా లాభమే. ‘అది నష్టం’ అని చెప్పే ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్సే ఉండరు. ఎలాంటి సందర్భంలో నష్టం అని చెబుతారంటే.. రేప్పొద్దున బంగారం ధర ఇంకా పెరిగితే? అది నష్టమే కదా? నిజమే. ప్రస్తుతం తులం బంగారం...