All-Time Record: ఆల్‌టైమ్‌ రికార్డు.. కొన్ని గంటల వ్యవధిలోనే రూ. 1.20 లక్షలకు చేరుకున్న బంగారం ధర

Gold All-Time Record: బంగారం అంటేనే మహిళలు భయపడిపోతున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో గ్రాము బంగారం కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితులు వచ్చాయి. రోజురోజుకు బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము. పండగలు, ఇతర శుభ కార్యలకు బంగారం తప్పకుండా కొనాల్సిందే. దేశంలో ఎంత పేద కుటుంబం అయినా కొద్దిగానైనా బంగారం

All-Time Record: ఆల్‌టైమ్‌ రికార్డు.. కొన్ని  గంటల వ్యవధిలోనే రూ. 1.20 లక్షలకు చేరుకున్న బంగారం ధర

Updated on: Sep 30, 2025 | 12:56 PM

Gold All-Time Record: దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. నిన్నటి నుంచి నేటి ఉదయం వరకు దాదాపు వెయ్యి రూపాయలు పెరిగిన బంగారం.. ఈ రోజు ఉదయం నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే రూ.1420 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1 లక్ష 18 వేల310కి చేరుకుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1 లక్ష 8వేల 450కి చేరుకుంది. తులం ధర రూ.1,20,700 మార్క్‌ను చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.1,18,460 ఉండగా, హైదరాబాద్‌లో రూ.1,18,310 ఉండగా, విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 3864 డాలర్ల దగ్గర, ఔన్స్ వెండి ధర సుమారు 47 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. పండుగ సీజన్‌లో బంగారం ధరలు ఇంతలా పెరిగిపోతుండటం సామాన్యులను ఆందోళన చెందుతున్నారు. బంగారం ధర తగ్గితే కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తున్నవారికి ఇది భారీ షాక్ అని చెప్పాలి. ఇక వెండి ధర విషయానికొస్తే కిలోపై వెయ్యి రూపాయలు పెరిగి ప్రస్తుతం 1 లక్ష 51 వేల రూపాయల వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌, కేరళ, చెన్నై రాష్ట్రాల్లో అయితే మరింతగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.1 లక్ష 61 వేల వద్ద ఉంది.

ఇది కూడా చదవండి: Thalapathy Vijay: దక్షిణాది సూపర్ స్టార్ దళపతి విజయ్ భార్య గురించి మీకు తెలుసా? ఆమె నికర విలువ ఎంత?

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Big Alert: బిగ్‌ అలర్ట్‌.. ఈ ఒక్క రోజే అవకాశం.. లేకుంటే బ్యాంకు అకౌంట్లు నిలిచిపోతాయ్!

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి