Gold Rates Today: బంగారం ధర కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులుగా బంగారం ధరలో పెద్దగా పెరుగదల కనిపించడం లేదు. తాజాగా సోమవారం బంగారం ధరలు కాస్తా తగ్గాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. అయితే ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. ఈ లెక్కన బంగారం ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగరాం ధర రూ. 67,090కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,180 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,030 గా ఉంది.
* ఇక మరో ప్రధాన నగరం చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,000 వద్ద కొనసాగుతోంది.
* కోల్‌కతా విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,030 వద్ద కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,030 వద్ద కొనసాగుతోంది.
* ఇక విజయవాడ విషయానికొస్తే ఇక్కడ కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,940, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,030గా ఉంది.
* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,940కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,030 వద్ద కొనసాగుతోంది.
వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. సోమవారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు కిలోకు రూ. 100ల మేర తగ్గాయి. తాజాగా ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 86,900గా ఉండగా.. ముంబయిలో రూ. 86,900, బెంగళూరులో రూ. 84,900 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నై, కేరళ, హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 91,900 వద్ద కొనసాగుతోంది.