బంగారం, వెండిని కొనుగోలు చేయాలంటేనే భయపడే రోజులొస్తున్నాయి. ప్రతి రోజు ధరలు పరుగులు పెడుతున్నాయి. ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ బంగారం, వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారత బులియన్ మార్కెట్లోనూ అదే ప్రభావం కనిపిస్తోంది. ఇక దేశంలో బంగారం ధర పెరుగుతూ వస్తోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతూనే ఉంది. దీపావళి తర్వాత భారీగానే పెరుగుతోంది. తాజాగా నవంబర్ 14న దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగితే, వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.
☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.48,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,760 ఉంది.
☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 వద్ద కొనసాగుతోంది.
☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 ఉంది.
☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,380 వద్ద ఉంది.
☛ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,260, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 వద్ద ఉంది.
☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 వద్ద ఉంది.
☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 ఉంది.
☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,640 వద్ద ఉంది.
ఇక బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,700 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.67,500 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.67,500 ఉండగా, చెన్నైలో రూ.67,500 ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.61,700 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.67,500 ఉంది. ఇక కేరళలో రూ.67,500 వద్ద కొనసాగుతోంది. కాగా, దేశంలోని ఇతర నగరాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం రేట్లలో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చునని గమనించాలి.
మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి