
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే 40వేల మార్క్‌ను దాటిన బంగారం ధరలు.. అలా పైపైకే వెళ్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.410 పెరిగి రూ.40,560కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.380 పెరిగి రూ.37,180కు చేరింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
మరోవైపు బంగారం ధరతో పాటు వెండి కూడా భారీగానే పెరిగింది. కేజీ వెండి రూ.320 పెరుగుదలతో రూ.48,1665కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారులు నుంచి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.