AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..

బంగారం, వెండి ధరల్లో మరోసారి స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు భారీగా పెరగడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొనగా.. తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఆగస్టు 20, 2026 ఉదయం నమోదైన ధరల వివరాలను తెలుసుకోండి... ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు.

Gold Price: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
Gold Silver Price Update
Shaik Madar Saheb
|

Updated on: Aug 20, 2026 | 6:46 AM

Share

బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతున్నాయి.. ఇటీవల తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. గత కొన్ని రోజుల నుంచి మళ్లీ భారీగా పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. పది రోజుల్లోనే దాదాపు 4వేల వరకు ధరలు పెరిగాయి.. ప్రధానంగా.. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.. ఈ క్రమంలోనే, బుధవారం బంగారం ధరలు తగ్గాయి. 700ల వరకు బంగారం పై ధర తగ్గింది. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా గురువారం (ఆగస్టు 20) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 మేర తగ్గి.. రూ.1,54,960 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,42,040 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి రూ.2,44,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,54,960, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,54,960, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,42,040 ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,55,110, 22 క్యారెట్ల ధర రూ.1,42,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,960, 22 క్యారెట్ల ధర రూ.1,42,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,960, 22 క్యారెట్ల ధర రూ.1,42,040 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,54,960, 22 క్యారెట్ల ధర రూ.1,42,040 ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర