Gold Price Today: బంగారం ధరలు తగ్గేదేలే.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

|

Mar 18, 2024 | 6:37 AM

బంగారం రేట్లు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక, రాజకీయ పరిణామాలు.. ద్రవ్యోల్భణం ప్రభావం ఇవన్నీ కూడా గోల్డ్, సిల్వర్ రేట్లపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఆకాశన్నంటుతున్నాయి.

Gold Price Today: బంగారం ధరలు తగ్గేదేలే.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold Price
Follow us on

బంగారం రేట్లు భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక, రాజకీయ పరిణామాలు.. ద్రవ్యోల్భణం ప్రభావం ఇవన్నీ కూడా గోల్డ్, సిల్వర్ రేట్లపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు 66 వేల మార్క్ దాటాయి. ఇదిలాఉంటే.. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా.. బంగారంపై పెట్టుబడి కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నాయి. కాగా.. తాజాగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల బంగారంపై రూ.10 తగ్గగా.. వెండిపై రూ.100 మేర ధర తగ్గింది.

ప్రధాన నగరాల్లో బంగారం 10 గ్రాముల రేట్లు ఇలా..

ఢిల్లీలో బంగారం రేట్లు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,730, 24 క్యారెట్లు రూ.66,240 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.60,580, 24 క్యారెట్లు రూ.66,090

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,140, 24 క్యారెట్ల ధర రూ.66,700

బెంగళూరులో 22 క్యారెట్లు రూ.60,580, 24 క్యారెట్ల ధర రూ.66,090

కేరళలో 22 క్యారెట్ల రేట్ రూ.60,580, 24 క్యారెట్లు రూ.66,090

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల ధర రూ.60,580, 24 క్యారెట్ల రేట్ రూ.66,090

విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.60,580, 24 క్యారెట్లు రూ.66,090 గా ఉంది.

వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,200
  • ముంబైలో సిల్వర్ ధర రూ.77,200
  • చెన్నైలో రూ.80,200
  • బెంగళూరులో రూ.76,000
  • కోల్‌కతాలో రూ.76,900
  • కేరళలో రూ.80,200
  • హైదరాబాద్‌లో రూ.80,200
  • విజయవాడలో రూ.80,200
  • విశాఖపట్నంలో రూ.80,200 లుగా ఉంది.