Gold Price: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

|

Sep 18, 2024 | 6:44 AM

అంతర్జాతీయంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ స్వల్పంగా పెరిగాయి. తాజాగా.. స్వల్పంగా తగ్గాయి.. బుధవారం (18 సెప్టెంబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం..

Gold Price: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price
Follow us on

అంతర్జాతీయంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.. ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. ఇటీవల భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ స్వల్పంగా పెరిగాయి. తాజాగా.. స్వల్పంగా తగ్గాయి.. బుధవారం (18 సెప్టెంబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర రూ.74,880 ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 68,640 గా ఉంది. మొత్తంగా బంగారంపై రూ.10 మేర ధర తగ్గింది.. వెండి కిలో ధర రూ. 100 మేర తగ్గి రూ.91,900లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూడండి..

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,640, 24 క్యారెట్ల ధర రూ.74,880 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,640, 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,880గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,790, 24 క్యారెట్ల ధర రూ.75,030, ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.68,640, 24 క్యారెట్లు రూ.74,880, చెన్నైలో 22క్యారెట్ల రేట్ రూ.68,640, 24 క్యారెట్లు రూ.74,880, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.68,640, 24 క్యారెట్లు రూ.74,880గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.91,900, ముంబైలో రూ.91,900, బెంగళూరులో రూ.85,900, చెన్నైలో రూ.96,900, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.96,600 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..