
Gold Price Today: శనివారం వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఆదివారం(18 మే) మాత్రం ఎటువంటి మార్పును నమోదు చేయలేదు. అంటే, దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయన్నమాట. భారత మార్కెట్లో బంగారం ధరలు రోజురోజుకూ తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల 10 గ్రాములకు రికార్డు స్థాయిలో లక్ష రూపాయలను తాకిన ఈ పసుపు లోహం.. ఇప్పుడు దాదాపు రూ.95,000కి పడిపోయింది. అంటే కొద్దిరోజుల్లోనే బంగారం ధర రూ.5,000ల వరకు తగ్గిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఇదే విధమైన ధోరణి కనిపిస్తుంది. ఏప్రిల్‌లో ఔన్సుకు $3,500 వద్ద గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ఇప్పుడు ఔన్సుకు $3,140కి పడిపోయింది.
ప్రపంచ వాణిజ్య యుద్ధం తగ్గుముఖం పట్టడం, బంగారం వంటి సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ తగ్గడం వల్ల మార్కెట్ విశ్లేషకులు ఈ పతనానికి కారణమని చెబుతున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడంతో, పెట్టుబడిదారులు సాంప్రదాయ భద్రతా వలయం నుంచి దృష్టిని మళ్లిస్తున్నట్లు ఇది సూచిస్తోంది. ఇది బంగారం ధరలలో ప్రస్తుత దిద్దుబాటుకు దారితీస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ తిరోగమనం కొద్దిరోజులేనని నిపుణులు అంటున్నారు. 2024, 2025 ప్రారంభంలో బంగారంలో కనిపించిన అద్భుతమైన రాబడి సమీప భవిష్యత్తులో పునరావృతం అయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. అయినప్పటికీ, దీర్ఘకాలానికి బంగారం బలమైన పెట్టుబడి ఎంపికగా ఉంటుందని సూచించారు.
2013లో బంగారం బాగా తగ్గిన ఇలాంటి దశను గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తితే, ప్రపంచ బంగారం ధరలు ఔన్సుకు $3,230 నుంచి $1,820 వరకు తగ్గవచ్చని ఆయన సూచించారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే, భారతదేశంలో దేశీయ బంగారం ధరలు మరింత తగ్గవచ్చు. బహుశా 10 గ్రాములకు రూ.55,000 నుంచి రూ.60,000 మధ్య స్థిరపడవచ్చు అని చెబుతున్నారు.
| నగరం | 22 క్యారెట్ల బంగారం రేటు (10 గ్రాములకు) | 24 క్యారెట్ల బంగారం రేటు (10 గ్రాములకు) |
| ఢిల్లీ | రూ. 87,350 | రూ. 95,200 |
| ముంబై | రూ. 87,200 | రూ. 95,130 |
| కోల్‌కతా | రూ. 87,200 | రూ. 95,130 |
| చెన్నై | రూ. 87,200 | రూ. 95,130 |
| అహ్మదాబాద్ | రూ. 87,250 | రూ. 95,180 |
| పూణే | రూ. 87,200 | రూ. 95,130 |
| లక్నో | రూ. 87,300 | రూ. 95,280 |
| బెంగళూరు | రూ. 87,200 | రూ. 95,130 |
| నోయిడా | రూ. 87,350 | రూ. 95,280 |
| హైదరాబాద్ | రూ. 87,200 | రూ. 95,130 |
బంగారం ధర వివిధ కారణాల వల్ల హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ప్రపంచ స్థాయిలో బంగారం డిమాండ్, మారకపు రేటు హెచ్చుతగ్గులు, ప్రస్తుత వడ్డీ రేట్లు, బంగారు వ్యాపారాన్ని నియంత్రించే ప్రభుత్వ నిబంధనలు కీలక ప్రభావాలలో ఉంటాయి. అదనంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం స్థితి, ఇతర కరెన్సీలతో పోలిస్తే US డాలర్ బలం వంటి అంతర్జాతీయ సంఘటనలు భారత మార్కెట్లో బంగారం ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
దేశ వ్యాప్తంగా వెండి ధరలు కూడా స్థిరంగానే నమోదయ్యాయి. ప్రస్తుతం వెండి కిలో రూ. 97,000లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో మాత్రం రూ. 1,08,000లుగా నమోదైంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..