Gold Rate Today: భారతీయులకు బంగారం, వెండి అంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. అందుకే మన దేశంలో ఈ రెండింటికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండారు. ఇక ఇప్పుడు పండగలు, శుభకార్యాల కోసం గోల్డ్ కొనుగోలు చేసే సంప్రదాయం మన దగ్గర చాలా కాలం నుంచి ఉంది. అందుకే సమయాన్ని బట్టి బంగారు, వెండి ధరలు మారుతుంటాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం ధరల్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కొక్కసారి తగ్గుతుంటాయి.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి.కానీ కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా.. ధరలలో ఎలాంటి మార్పులు రాలేదు. శుక్రవారం (20సెప్టెంబర్ 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర రూ.74,000 ఉంటే.. 22 క్యారెట్లు 68,000 గా ఉంది. మొత్తంగా బంగారంపై రూ.100 మేర ధర తగ్గింది.. వెండి కిలో ధర రూ. 100 మేర తగ్గి రూ.95,900లుగా ఉంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 10 గ్రాముల అంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,440 గా ఉంది. హైదరాబాద్ తోపాటు ముంబై, కోల్ కతా, బెంగళూరు, కేరళ, పూణే వంటి నగరాల్లోనూ ఇదే ధర కొనసాగుతుంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,490, 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,440గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.74,590 ఉండగా.. అహ్మాదాబాద్ లో రూ. 74,490గా ఉన్నాయి. ముంబైలో 24 క్యారెట్లు రూ.74,440, చెన్నైలో 24 క్యారెట్లు రూ.74,440, బెంగళూరులో 24 క్యారెట్లు రూ.74,440గా ఉన్నాయి.
వెండి ధరలు ఇలా ఉన్నాయి..
ఈరోజు (సెప్టెంబర్ 20న) హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.95,900 ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ.95,900 లుగా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.90,900, ముంబైలో రూ.90,900, బెంగళూరులో రూ.85,900, చెన్నైలో రూ.95,900లుగా ఉంది.