Gold Price Today: మహిళలకు గట్టి షాకిచ్చిన బంగారం ధరలు.. రికార్డ్‌ స్థాయిలో పెంపు.. లక్ష చేరువలో వెండి!

|

Sep 14, 2024 | 6:35 AM

దేశంలో బంగారం, వెండి ధరలు గట్టి షాకిచ్చాయి. బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగా పతనమైన బంగారం ధరలు.. అప్పటి నుంచి క్రమంగా దిగి వస్తున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యలలో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. అయితే తాజాగా తులం బంగారంపై..

Gold Price Today: మహిళలకు గట్టి షాకిచ్చిన బంగారం ధరలు.. రికార్డ్‌ స్థాయిలో పెంపు.. లక్ష చేరువలో వెండి!
Gold Price Today
Follow us on

దేశంలో బంగారం, వెండి ధరలు గట్టి షాకిచ్చాయి. బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగా పతనమైన బంగారం ధరలు.. అప్పటి నుంచి క్రమంగా దిగి వస్తున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యలలో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. అయితే తాజాగా తులం బంగారంపై భారీగా పెరిగింది. నిన్న ఉదయం 6 గంటలకు నమోదైన ధరలతో పోలిస్తే సెప్టెంబర్‌ 14న దేశీయంగా తులం బంగారంపై 1300 వరకు ఎగబాకింది. దీంతో మహిళలకు ఉన్నట్టుండి షాకచ్చినట్లయ్యింది. ప్రస్తుతం దేశీయంగా ధరను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,460 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. కాలానుగుణంగా ప్రాంతాలను బట్టి ధరలు పెరగవచ్చు. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,460 ఉంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,460 ఉంది.

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.68,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,610 ఉంది.

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,460 ఉంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,460 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,460 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,460 ఉంది.

➦ ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. కిలో వెండిపై భారీగానే పెరిగింది. ఏకంగా రూ.3600 వరకు పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.89,600 ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగానే ఉంది. చెన్నై, హైదరాబాద్‌, కేరళలలో కిలో వెండి ధర రూ.95,100 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి