Gold price on april 28th 2021: బంగారం ధరలు తగ్గతూనే వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు దిగొస్తున్నాయి. దీంతో బంగారం కొనాలని చూస్తున్నవారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇక పెళ్ళీళ్ల సీజన్ ప్రారంభంలోనే పసిడి ధరలు తగ్గడమనేది బంగారం ప్రేమికులకు కాస్తా ఊరట కలిగించే అంశం. బుధవారం ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,800గా ఉంది.. అలాగే హైదరాబాద్, విజయవాడతోపాటు ఢిల్లీ వంటి పట్టాణాల్లో ఇవాళ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బుధవారం ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,450 ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల రూ.48,460గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో రూ.44,450 ఉండగా.. 10గ్రాముల 24 క్యారెట్ల రూ.48,460గా ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.46,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,180గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,800 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,800గా ఉంది. అలాగే చెన్నై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,650 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.48,710గా కొనసాగుతుంది. ఇక నిన్న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరకు 1760 డాలర్ల వద్ద చేరింది.
Also Read: సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..
UPI: యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి
ప్రీమియం కట్టడం ఒక్కసారి మాత్రమే..! బ్యాంకు వడ్డీ కంటే డబుల్ ప్రాఫిట్..? ఎల్ఐసీ సూపర్ పాలసీ..