పండగ వేళ భగ్గుమన్న పసిడి, వెండి ధరలు.. సామాన్యులు కొనాలనే మాట మరచిపోవల్సిందేనా..!

ప్రస్తుతం పండగల సమయం.. దసరా, అక్షయ తృతీయ, దీపావళి వంటి పండగలతో పాటు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ బంగారం, వెండి లోహాలను కొనుగోలుకి ఆసక్తిని చూపిస్తారు. అయితే గత కొంత కాలంగా పసిడి ధరలు చుక్కలను తాకుతున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంటుంది. దసరా పండగ సమయంలో పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ.. బంగారం ధర భగ్గుమంది. అదే బాటలో వెండి పయనిస్తోంది. హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

పండగ వేళ భగ్గుమన్న పసిడి, వెండి ధరలు.. సామాన్యులు కొనాలనే మాట మరచిపోవల్సిందేనా..!
Gold And Silver Price

Updated on: Oct 01, 2025 | 11:59 AM

ప్రస్తుతం పండగల సమయం.. దసరా, అక్షయ తృతీయ, దీపావళి వంటి పండగలతో పాటు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ బంగారం, వెండి లోహాలను కొనుగోలుకి ఆసక్తిని చూపిస్తారు. అయితే గత కొంత కాలంగా పసిడి ధరలు చుక్కలను తాకుతున్నాయి. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంటుంది. దసరా పండగ సమయంలో పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ.. బంగారం ధర భగ్గుమంది. అదే బాటలో వెండి పయనిస్తోంది. హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నవరాత్రి, విజయదశమి వేళా పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ.. దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం లక్షన్నర వైపు పరుగులు తీస్తుండగా.. వెండి కూడా నేను సైతం అంటూ కిలో రెండు లక్షల వైపు పరుగులు పెడుతోంది. ఇదే విధంగా పసిడి వెండి ధరలు దేశీయ మార్కెట్ లో పరుగులు పెడుతూ ఉంటే.. ఇక సామాన్యులు బంగారం, వెండి కొనాలనే మాట మరచిపోవాల్సిందే.

ఈ రోజు మధ్యాహ్నం సమయానికి బంగారం ధర మరోసారి భగ్గుమంది. నవరాత్రులలో వరస గత ఆరు రోజుల్లో బంగారం ధర ఐదు రోజులు పెరగగా.. ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వచ్చే సరికి
హైదరాబాద్‌లో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,730లకు చేరుకోగా… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,800లకు చేరుకుంది.
ఇక మరోవైపు నేను సైతం అంటూ కిలో వెండి ధర రూ.1,49,200లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

వెండి,బంగారం రెండింటికీ వివిధ ప్రయోజనాల కోసం డిమాండ్ ఉంది. ఈ లోహాలను ఆర్ధిక భద్రత కోణంలో అత్యందికంగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..