Gold Price Today: బంగారం ప్రియులకు షాక్‌.. పెరిగిన పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!

|

May 08, 2021 | 6:57 AM

Gold Price Today: దేశంలో మళ్లీ బంగారం పరుగులు పెడుతోంది. గత నెలలో దిగివచ్చిన పసిడికి ఇప్పుడు రెక్కలొచ్చాయి. రోజురోజుకు పెరుగుతూ బంగారం కొనుగోలు చేసేవారికి..

Gold Price Today: బంగారం ప్రియులకు షాక్‌.. పెరిగిన పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!
Gold Price
Follow us on

Gold Price Today: దేశంలో మళ్లీ బంగారం పరుగులు పెడుతోంది. గత నెలలో దిగివచ్చిన పసిడికి ఇప్పుడు రెక్కలొచ్చాయి. రోజురోజుకు పెరుగుతూ బంగారం కొనుగోలు చేసేవారికి షాకిస్తోంది. తాజాగా శనివారం 10 గ్రాములపై రూ.510 వరకు పెరిగింది. అయితే దేశంలో ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెరుగుతోంది. దేశీయంగా చూస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,290 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో తాజా ధరల వివరాలు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,910 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,970 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,060 వద్ద ఉంది.

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,800 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,940 వద్ద కొనసాగుతోంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 వద్ద ఉంది.

అయితే పసిడి రేట్లపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, కరోనా, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారు ధరలను తెలుసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ చదవండి

SBI Customer: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. కరోనా సమయంలో కొత్త సర్వీసులను అందుబాటులోకి..!

Mi Fast Charger: భారత్‌లో విడుదల కానున్న ఎంఐ కొత్త ఫాస్ట్ ఛార్జర్.. దీని ప్రత్యేకతలు ఇవే..!