
Gold, Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరగడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ పెరుగుదల దిశగా పయనించడంతో మార్కెట్‌లో మళ్లీ చురుకుదనం కనిపిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్ దగ్గరపడుతున్న ఈ సమయంలో బంగారం కొనాలని భావించిన వారికి ఈ పెరుగుదల నిరాశ కలిగిస్తోంది.
కొద్ది రోజుల క్రితం వరకు బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు. తక్కువ ధరల్లో పసిడి కొనుగోలు చేసే మంచి అవకాశం లభించిందని భావించిన వారు మార్కెట్ వైపు ఆసక్తి చూపారు. అయితే ఈ తగ్గుదల ఎక్కువకాలం నిలవలేదు. ఒక్కరోజులోనే ధరలు పెరగడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. నిన్నటి నుంచి దేశ వ్యాప్తంగా మళ్లీ ధరలు పెరగడం మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే దాదాపు 4 వేల వరకు ఎగబాకింది. ఒక్కరోజులోనే ఈ మార్పులు కనిపించడం సాధారణ వినియోగదారులకు షాక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Mahindra EV: వామ్మో.. ఇంత తగ్గింపా.. చౌకగా మహీంద్రా ఇ-కార్లు.. రూ.4 లక్షల వరకు తగ్గింపు!
ఇదే సమయంలో వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే రూ.15 వేల వరకు పెరిగింది. గ్రాము నుంచి కిలో వరకు అన్ని స్థాయిల్లో వెండి ధరలు పెరగడం గమనించదగిన విషయం. ముఖ్యంగా పెద్ద మొత్తంలో వెండి కొనుగోలు చేసే వ్యాపారులపై ఈ పెరుగుదల ప్రభావం చూపే అవకాశముంది.
తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,680 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,460 ఉంది. ఇక వెండి ధర రూ.2,60,100 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: LPG Refill Booking: సిలిండర్ బుకింగ్ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. అసలు విషయం ఇదే..!
అదే విధంగా ముడి చమురు ధరలు తగ్గడం కూడా ఈ మార్పుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు తమ నిధులను వేర్వేరు రంగాల మధ్య మార్చుకోవడం వల్ల బంగారం, వెండి ధరల్లో ఇలాంటి హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: యాక్టివా కంటే చవకైనది.. 90 కి.మీ. మైలేజ్.. జపనీస్ కంపెనీ వాహనాలకు డిమాండ్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి