Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన పసిడి ధరలు.. మరింత పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు

|

Jun 01, 2021 | 6:15 AM

Gold Price Today: బంగారం మళ్లీ పరుగులు పెడుతోంది. గత రెండునెలల కిందట కాస్త తగ్గుతూ వచ్చిన బంగారం మే నెల నుంచి పరుగులు పెడుతూ మధ్య మధ్యలో తగ్గుముఖం..

Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన పసిడి ధరలు.. మరింత పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు
Follow us on

Gold Price Today: బంగారం మళ్లీ పరుగులు పెడుతోంది. గత రెండునెలల కిందట కాస్త తగ్గుతూ వచ్చిన బంగారం మే నెల నుంచి పరుగులు పెడుతూ మధ్య మధ్యలో తగ్గుముఖం పట్టింది. తాజాగా మంగళవారం మళ్లీ బంగారం ధర పెరిగింది. తాజాగా పెరిగిన బంగారం ధరలతో దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 46,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,480 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,480 వద్ద కొనసాగుతోంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,860 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070 గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070 వద్ద కొనసాగుతోంది.

కాగా, మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు ఇవి. బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం బెటర్‌. అయితే ముందు ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

సామాన్యుడి నడ్డి విరుస్తున్న వంట నూనె ధరలు.. భారీగా పెరుగుతున్న ఆయిల్‌ ధరలు.. పెరుగుదలకు కారణాలేంటి..?

New Rules : జూన్‌ 1వ తేదీ నుంచి పలు అంశాల్లో నిబంధనలు మారనున్నాయి.. తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే..!