Gold Price Today: మగువలకు షాకింగ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!

|

Oct 08, 2021 | 6:00 AM

Gold Price Today: దసరా, దీపావళి, పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. ఈ సెంటిమెంట్

Gold Price Today: మగువలకు షాకింగ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!
Follow us on

Gold Price Today: దసరా, దీపావళి, పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. ఈ సెంటిమెంట్ కారణంగా.. భారతదేశంలో బంగారం కొనుగోళ్లు జోరుగా పెరుగుతాయి. భారత్‌లో పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర‌ల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

నిన్న తగ్గిన బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. తాజాగా శుక్రవారం (అక్టోబర్‌ 8) దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి 300 వరకు పెరిగింది. ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో శుక్రవారం ధరల వివరాలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,120 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000 ఉంది.

అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,780 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,780 ఉంది.

పసిడి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

Navaratri 2021: రేపు గాయత్రీ అమ్మవారి అలంకారం.. ఏ నైవేద్యం పెట్టాలంటే.. తయారీ విధానం