గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలో కాస్త స్థిరంగా కనిపిస్తోది. అంతకుముందు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరల్లో ఇప్పుడు కాస్త తగ్గుదల కనిపిస్తోంది. బంగారం దూకుడు చూస్తుంటే తులం ధర రూ. 70 వేలు దాటేస్తుందన్న భావన కలిగింది. అయితే గడిచిన వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తక్కువ మొత్తం తగ్గుదుల కూడా కనిపిస్తోంది. తాజాగా సోమవారం కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల ధరపై రూ. 10 తగ్గింది. మరి ఈ రోజు దేశ్ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,340గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,540 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,190గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,390 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,790కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,040గా ఉంది. ఇక బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,190 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,390గా ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,190గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర ర.62,390 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,190గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,390 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,190గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,390గా ఉంది.
వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. సోమవారం వెండి ధరలో తగ్గుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీతోప ఆటు ముంబయి, కోలకతా, పుణె, జైపూర్, లక్నో వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 76,400గా ఉంది. ఇక చెన్నై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సోమవారం కిలో వెండి ధర రూ. 77,900 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..