
హైదరాబాద్, ఫిబ్రవరి 1: పుత్తడిని ఇష్టపడని మగువలు ఉండరు. వేడుక ఏదైనా ఒంటి నిండా అందంగా అలంకరించుకుని అద్దంలో తమను తాము చూసుకుని మురిసిపోతుంటారు. ఇక పండగలు, ఫంక్షన్లకు కొత్త కొత్త డిజైన్లు కొనేందుకు అమితాశక్తి కనబరుస్తుంటారు. ధరెంతైనా చెల్లించి నచ్చిన నగలు కొంటుంటారు. అయితే కొందరు మాత్రం స్టాక్ మార్కెట్లో చోటు చేసుకునే పరిణామాలు జగ్రత్తగా పరిశీలిస్తూ ధరలు తగ్గినప్పుడు మదుపు చేసిన సొమ్మును వెచ్చింది బంగారం, వెండి ఆభరణాలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకు నిత్యం పుత్తడి, వెండి ధరల్లో వచ్చే హెచ్చు తగ్గులపై ఓ కన్నేసి ఉంచుతారు. తాజాగా ఫిబ్రవరి 2న శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15లు పెరిగి రూ.5,815ల వద్ద ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.17లు పెరిగి రూ.6,344ల వద్ద కొనసాగుతోంది.
ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150లు పెరిగి, రూ.58,150లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.170లు పెరిగి రూ.63,440ల వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రూ.13లు పెరిగి రూ.4,758 వద్ద ఉండగా.. 10 గ్రాములు ధర రూ. 130లు పెరిగి రూ.47,580లుగా నిలిచింది.
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,580
22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,150
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,440
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,580
22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,150
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,440
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,300లు ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,590 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,150లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,440లు, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,800లు, 24 క్యారెట్ల ధర రూ.64,150లు ఉంది. అలాగే, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,1500లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,440లు ఉంది. కోల్‌కతా, ముంబై, కేరళ, పూణెలలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.
ఇక వెండి ధరల విషయాని కొస్తే.. వెండి కిలో రూ. 200ల మేర తగ్గి.. రూ.76,300లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,800లు, విశాఖపట్నంలో రూ.77,800లు, చెన్నైలో రూ.77,800ల వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో రూ.74,000, ముంబైలో76,300లుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.