
Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు దూసుకుపోతున్నాయి. తగ్గినట్లే తగ్గి భారీగా పెరుగుతోంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానముంది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యలలో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. నిన్న ఉదయంతో పోల్చుకుంటే ఈ రోజు అంటే ఆగస్ట్ 31న తులంపై భారీగా పెరిగింది. ఏకంగా 1640 రూపాయలకుపైగా ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. బంగారం ధరల పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువలో మార్పులు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికంగా ఉండటం ఇవన్నీ ప్రధాన కారణాలు అని చెబుతున్నారు. అంతేకాదు ద్రవ్యోల్బణం పెరిగిన సందర్భాల్లో చాలా మంది పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లడం వల్ల ధరలు ఇంకా ఎగబాకుతున్నాయి. ఇక రానున్న పండుగ సీజన్‌లో భారత్‌లో బంగారం డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి