Gold Price Today: బాబోయ్ బంగారం..! రూ. 2 లక్షలు టార్గెట్.? ఇవాళ రేటు తెలిస్తే గుండెల్లో బేజారే

బంగారం భగ్గుమంటోంది. పండుగ వేళ కూడా ఎవ్వరికీ అందనంత ఎత్తుకు వెళ్తూ.. కిందకి దిగి రానంటోంది. అన్ని రికార్డులు దాటుకుంటూ పోతోంది బంగారం ధర. దానికి తోడు సిల్వర్‌ కూడా తగ్గేదే లే అంటోంది. వీటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price Today: బాబోయ్ బంగారం..! రూ. 2 లక్షలు టార్గెట్.? ఇవాళ రేటు తెలిస్తే గుండెల్లో బేజారే

Updated on: Sep 24, 2025 | 7:33 AM

పసిడి పరుగులు పెడుతోంది. ఆల్‌టైం హైకి చేరుకొని.. ఎవ్వరూ ఊహించనంత రీతిలో ధరలు ఆకాశాన్నంటున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది కల్లా రూ. 2 లక్షల మార్క్ చేరుకుంటుందని అంటున్నారు. ఆర్థిక అనిశ్చితి. డాలర్ బలహీనత. ఫెడ్ వడ్డీరేట్లు, జియో పాలిటిక్స్‌, సెంట్రల్ బ్యాంకుల విపరీతమైన కొనుగోళ్లు ఇవన్నీ కలిసి బంగారం రేట్లను అమాంతంగా పెంచేశాయి. అంతేకాదు పెట్టుబడిదారుల భయం కూడా ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నవరాత్రి పండుగ వేళ కూడా బంగారం పైపైకి ఎగబాకుతోంది. గత మూడు రోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 3550 మేరకు పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 3260 మేరకు పెరిగింది. అటు వెండి కూడా బంగారం బాటలోనే పయణిస్తోంది. గడిచిన మూడు రోజుల్లో రూ. 5100 మేరకు ఎగబాకింది. మరి ఇవాళ బంగారం, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం..

22 క్యారెట్ల బంగారం

చెన్నై – రూ. 1,06,410

బెంగళూరు – రూ. 1,06,060

ఢిల్లీ – రూ. 1,06,210

కోల్‌కతా – రూ. 1,06,060

ముంబై – రూ. 1,06,060

హైదరాబాద్ – రూ. 1,06,060

24 క్యారెట్ల బంగారం

చెన్నై – రూ. 1,16,090

బెంగళూరు – రూ. 1,15,700

ఢిల్లీ – రూ. 1,15,850

కోల్‌కతా – రూ. 1,15,700

ముంబై – రూ. 1,15,700

హైదరాబాద్ – రూ. 1,15,700

వెండి ధరలు ఇలా

చెన్నై – రూ. 1,50,100

బెంగళూరు – రూ. 1,40,100

ఢిల్లీ – రూ. 1,40,100

కోల్‌కతా – రూ. 1,40,100

ముంబై – రూ. 1,40,100

హైదరాబాద్ – రూ. 1,50,100

కాగా, పైన పేర్కొన్న ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ గోల్డ్ రేట్స్ కోసం 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.