Gold Price Today: మళ్లీ పెరుగుతోన్న బంగారం ధరలు.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?

|

May 16, 2024 | 6:40 AM

గతకొన్ని రోజులుగా స్థిరంగా లేదా తగ్గుముఖం పట్టిన, బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభమైంది. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. దీంతో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,160కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260 వద్ద కొనసాగుతోంది...

Gold Price Today: మళ్లీ పెరుగుతోన్న బంగారం ధరలు.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
Gold Price
Follow us on

గతకొన్ని రోజులుగా స్థిరంగా లేదా తగ్గుముఖం పట్టిన, బంగారం ధరలు మళ్లీ పెరగడం ప్రారంభమైంది. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. దీంతో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,160కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260 వద్ద కొనసాగుతోంది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,036కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,130 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 67,155కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,155కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,260గా ఉంది.

* బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,210కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,320గా ఉంది.

* చెన్నై విషయానికొస్తే గురువారం ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,348 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,470గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాదర్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 67,265కాగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,380 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 67,265కాగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,380 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 67,265కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,380గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరల్లో కూడాప పెరుగుదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ. 87,700కి చేరుకోగా ముంబయి, కోల్‌కతా, పుణె వంటి నగరాల్లో ఇదే ధర ఉంది. ఇక హైదరాబాద్‌తో పాటు, విజయవాడ, విశాఖపట్నంలో అత్యధికంగా రూ. 91,100కి చేరింది.

ఈ ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా రీడర్స్‌ గమనించాలి. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్‌ చేసుకోవడం బెటర్‌. ఇక లేటెస్ట్‌ ధరల వివరాలను తెలుసుకోవడానికి మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి ధరలను కూడా తనిఖీ చేయవచ్చు. బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. కొంత సమయం లోపు మీరు SMS ద్వారా రేటు సమాచారాన్ని పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..