తగ్గిందనుకున్న బంగారం ధర.. మళ్లీ భారీగా పెరగడం మొదలుపెట్టింది. నిన్నటితో పోలిస్తే దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 మేరకు పెరగగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 400 మేరకు ఎగబాకింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..
ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,940కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,460గా ఉంది. ఇక హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, ముంబై, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,310గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 77,790గా కొనసాగుతోంది.
బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతుంటే.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. గడిచిన రెండు రోజుల్లో సుమారు రూ. 600 మేరకు తగ్గాయి వెండి ధరలు. నిన్న స్థిరంగా కొనసాగిన వెండి ధర.. ఇవాళ రూ. 100 మేరకు తగ్గింది. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, ముంబైలో కిలో వెండి రూ. 90,900గా ఉంది. అలాగే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి రూ. 99,400 కాగా, కేరళ, చెన్నైలో కూడా కిలో వెండి రూ. 99,400గా కొనసాగుతోంది. కాగా, ఈ ధరలు బుధవారం ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కొనే ముందు ఒకసారి ధరలు చెక్ చేసుకోవడం బెటర్. ఇక లేటెస్ట్ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి