Gold Rate Today: గోల్డ్‌ లవర్స్‌కి నిజంగానే గోల్డెన్‌ న్యూస్‌.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.

|

May 26, 2024 | 6:29 AM

మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలకు కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. తులం బంగారం ధర రూ. 80 వేలు దాటడం ఖాయమని అందరూ అనుకున్న తరుణంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కల్పించాయి. పెళ్లిళ్ల సీజన్‌ కాకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల్లో...

Gold Rate Today: గోల్డ్‌ లవర్స్‌కి నిజంగానే గోల్డెన్‌ న్యూస్‌.. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.
Gold Price
Follow us on

మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలకు కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. తులం బంగారం ధర రూ. 80 వేలు దాటడం ఖాయమని అందరూ అనుకున్న తరుణంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కల్పించాయి. పెళ్లిళ్ల సీజన్‌ కాకపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల్లో పెరుగుదలకు చెక్‌ పడినట్లు స్పష్టమవుతోంది. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఆదివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,550కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ. 72,590 వద్ద కొనసాగుతోంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,440 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,550గా ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,600 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,400కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,440 వద్ద స్థిరంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,440 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,400గా ఉంది.

* ఇక విశాఖపట్నంలోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 66,400, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,400 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో కిలో వెండి ధర రూ. లక్ష దాటగా ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారంతో ఢిల్లీతోపాటు, ముంబయి, కోలకతా, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 91,500గా ఉంది. ఇక చెన్నైతో పాటు, హైదారబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, కేరళలలో కిలో వెండి ధర రూ. 96,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..