Gold Rate Today: బిగ్ రిలీఫ్‌.. భారీగా తగ్గిన బంగారం ధర. తులం గోల్డ్‌ ఎంతుందంటే..

|

May 25, 2024 | 6:31 AM

బంగారం ప్రియులకు ఇది నిజంగానే శుభవార్త అని చెప్పొచ్చు. మొన్నటి వరకు బంగారం భగభగల నుంచి కొనుగోలుదారులకు ఉపశమనం లభిస్తోంది. బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. తులం బంగారం ధర రూ. 75 వేల మార్క్‌ దాటి రూ. 80 వేలకు చేరువ కానుందని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా రూ. 72 వేలకు చేరింది. అమెరికాలో ఎన్నికలు పూర్తయ్యే వరకు...

Gold Rate Today: బిగ్ రిలీఫ్‌.. భారీగా తగ్గిన బంగారం ధర. తులం గోల్డ్‌ ఎంతుందంటే..
Gold Price
Follow us on

బంగారం ప్రియులకు ఇది నిజంగానే శుభవార్త అని చెప్పొచ్చు. మొన్నటి వరకు బంగారం భగభగల నుంచి కొనుగోలుదారులకు ఉపశమనం లభిస్తోంది. బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. తులం బంగారం ధర రూ. 75 వేల మార్క్‌ దాటి రూ. 80 వేలకు చేరువ కానుందని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా రూ. 72 వేలకు చేరింది. అమెరికాలో ఎన్నికలు పూర్తయ్యే వరకు వడ్డీరేట్లు తగ్గకపోవచ్చు అన్న అంచనాలతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంతో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మరి శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,540 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,580 వద్ద స్థిరపడింది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,390గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,430 వద్ద కొనసాగుతోంది.

* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,490గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,540 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,390గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,430 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* ఇక హైదరాబాద్‌ విషయానికొస్తే ఇక్కడ శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,390గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,430 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,390గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,430గా ఉంది.

* విశాఖపట్నంలోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,390కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,430 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరల్లో కూడా తగ్గుదుల కనిపించింది. మొన్నటి వరకు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ. లక్ష దాటగా తాజాగా కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఢిల్లీలో పాతు, కోల్‌కలతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 91,900 వద్ద కొనసాగుతోంది. కాగా హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ. 92,400 వద్ద స్థిరపడింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..