Gold Price Today: కరోనా లాక్ డౌన్ తర్వాత బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి ధరలను తాకాయి. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు దిగివస్తున్నాయి. బంగారం కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం అని భావించవచ్చు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.100 తగ్గింది. దీంతో నిన్నటితో పోల్చుకుంటే ఆదివారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,340కు చేరింది.
ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.44,250గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,290కు చేరింది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్ తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.44,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,290కు చేరింది. అటు దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.46,400 కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 దగ్గర కొనసాగుతుంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,680కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.48,740 దగ్గర కొనసాగుతుంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,340 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,340గా ఉంది.
Also Read: Today Gold Rates : నేడు ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి…