Gold Price Today: రోజురోజుకు పతనమవుతున్న బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా?

Gold Price Today: తాజాగా ఆగస్ట్‌ 23వ తేదీన దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒక రోజు సల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెండింతలు పెరుగుతోంది. చాలా మంది తులం బంగారం ధర కనీసం 90 వేల రూపాయల వరకైనా దిగి వస్తుందేమోనని ఎదురు..

Gold Price Today: రోజురోజుకు పతనమవుతున్న బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా?

Updated on: Aug 23, 2025 | 6:18 AM

Gold Price Today: బంగారం ధరలు రోజురోజుకు దిగి వస్తున్నాయి. ప్రస్తుతం తులం ధర కొనాలంటే లక్ష రూపాయలకుపైనేగా పెట్టుకోవాల్సిందే. అయితే ఇటీవల లక్షా 5 వేల చేరువలో ఉన్న పసిడి.. లక్ష దగ్గరకు వచ్చింది. తాజాగా ఆగస్ట్‌ 23వ తేదీన దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే సుమారు రూ.250 వరకు తగ్గింది. ఒక రోజు సల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెండింతలు పెరుగుతోంది. చాలా మంది తులం బంగారం ధర కనీసం 90 వేల రూపాయల వరకైనా దిగి వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతట్లో దిగి వచ్చే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,290 వద్ద కొనసాగుతోంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,140 వద్ద కొనసాగుతోంది.
  3. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,140 వద్ద కొనసాగుతోంది.
  4. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,140గా ఉంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,140గా ఉంది.
  6. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,140గా ఉంది.
  7. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,140గా ఉంది.
  8. ఇక బంగారం ధర తగ్గితే వెండి స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ప్రస్తుతం రూ.1,18,100 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి