Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర… ఇదే ట్రెండ్‌ కొనసాగవచ్చంటున్న విశ్లేషకులు

|

Apr 18, 2021 | 6:04 AM

Gold Rate Today: బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూసే. ఎందుకంటే మళ్లీ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన ధరలు.. ఇప్పటి వరకు అదే స్పీడు కొ...

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర... ఇదే ట్రెండ్‌ కొనసాగవచ్చంటున్న విశ్లేషకులు
Gold Price
Follow us on

Gold Rate Today: బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూసే. ఎందుకంటే మళ్లీ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి పెరిగిన ధరలు.. ఇప్పటి వరకు అదే స్పీడు కొనసాగిస్తోంది. అయితే మధ్య మధ్యలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా.. ఓవరల్‌గా పరిశీలిస్తే పెరుగుదలనే ఎక్కువగా ఉంది. గత పది రోజుల్లో బంగారం ధరలు ఏడు సార్లు పెరుగగా, మూడు సార్లు మాత్రమే తగ్గాయి. ఈ 17 రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాములపై 3 వేల వరకు పెరిగింది. అలాగే 24 క్యారెట్లు ఉన్న 10 గ్రాముల బంగారంపై 3వేలకుపైగా పెరిగింది. ఈ లెక్కన చూస్తే.. తగ్గుదలకంటే పెరుగుదలనే ఎక్కువగా ఉంది. తాజాగా ఆదివారం కూడా బంగారం ధరలు పెరిగాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా…

► ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,410

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది.

► ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,520 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ర.48,160 ఉంది.

►విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160 ఉంది.

కాగా, బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా..? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇందుకు దేశంలో కరోనా వ్యాప్తి కారణమనే చెబుతున్నారు. గత రెండు నెలలుగా స్టాక్‌ మార్కెట్లు పెద్దగా ప్రయోజనం కలిగించడం లేదు. పెట్టుబడులను వేరే వాటిపైన మళ్లించాలని చూస్తున్నారు. కొంత మంది బిట్‌కాయిన్‌, డాలర్‌ కరెన్సీ వైపు మళ్లిస్తున్నారు. ఇప్పుడు వారికి బంగారంపై నిఘా ఉంది. క్రమ క్రమంగా పసిడి ధరలు పెరుగుతుంటే దానిపై పెట్టుబడి పెడుతున్నారు. తద్వారా త్వరలోనే మంచి రిటర్న్స్ వస్తాయనే అంచనాతో ఉన్నారు. అందుకే 16 రోజులుగా బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. దేశంలో కరోనా తగ్గే వరకూ ఈ ట్రెండ్ కొనసాగవచ్చనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చదవండి: Credit Card Payment: క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారా..? అయితే ఇలా చేయండి

Fixed Deposit: బ్యాంకులు ఎఫ్‌డీలపై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి…?