పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు నేలచూపులు చూశాయి. పసిడి రేటు కిందకు దిగొచ్చింది. ఇది పసిడి ప్రేమికులకు ఊరట కలిగించే చెప్పుకోవచ్చు. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 47,950 ఉండగా.. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,950కు చేరింది. ఇక హైదరాబాద్‌తో సహా పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో చెప్పుకొదగిన మార్పులు ఏమి కనిపించలేదు.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 44,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,980కు చేరింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,040 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 51,320కు చేరింది. ఇక ముంభైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 47,950కు చేరింది. అలాగే విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,900 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,980కు చేరింది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,330 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 49,450కు చేరింది. అయితే బంగారం ధరలలో పెద్దగా మార్పు ఏమి కనిపించలేదు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రెట్లు, జువెలరీ మార్కెట్, వాణిజ్యలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.
IND vs ENG: టీమిండియా పేస్ పంచ్‌కు ఇంగ్లాండ్ విలవిల.. తొలి టెస్ట్‌లో కోహ్లీసేన శుభారంభం..