Gold Price Today In India: బంగారం కోనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. గత రోజులుగా పసిడి ధరలు దిగివస్తున్నాయి. మార్కెట్లో బంగారం ధరలు వరుసగా క్షీణిస్తున్నాయి. దీంతో ఇన్ని రోజులుగా బంగారాన్ని కోనాలని వేచి చూస్తున్నవారికి ఇది సరైన అవకాశంమని చెప్పుకోవచ్చు. అటు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో మాత్రం పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా శుక్రవారం మరోసారి పసిడి ధరలు తగ్గాయి.
ఇవాళ దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.46,750 దగ్గర కోనసాగుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో పసడి ధరలు ఈవిధంగా ఉన్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,400 దగ్గర ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.47,350గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.45,550 కొనసాగుతుండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.49,690 దగ్గరగా ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.43,400 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,350గా ఉంది. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,750 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.46,750 దగ్గరగా కొనసాగుతుంది. చెన్నై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.43,720 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.47,710 దగ్గర కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో మార్పులు అలాగే.. సెంట్రల్ బ్యాంకులలో ఉన్న పసిడి నిల్వలు, వాణిజ్య యుద్ధాలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరలు హెచ్చుతగ్గులలో ప్రభావం చూపిస్తాయి.
Also Read: