Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

|

Jun 23, 2024 | 6:34 AM

బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే.. కిందకి దిగిరావడం లేదు. తగ్గినా కూడా మరుసటి రోజు లేదా వరుసగా భారీగా పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు అల్‌టైమ్‌ హైలో ఉన్నాయి.. పది గ్రాముల బంగారం ధర 73 వేలకు చేరువలో కొనసాగుతుండగా.. వెండి కిలో ధర రూ.93 వేలకు చేరువలో కొనసాగుతోంది.

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
Gold, Silver Price
Follow us on

బులియన్ మార్కెట్ పరుగులు పెడుతోంది.. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే.. కిందకి దిగిరావడం లేదు. తగ్గినా కూడా మరుసటి రోజు లేదా వరుసగా భారీగా పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు అల్‌టైమ్‌ హైలో ఉన్నాయి.. పది గ్రాముల బంగారం ధర 73 వేలకు చేరువలో కొనసాగుతుండగా.. వెండి కిలో ధర రూ.93 వేలకు చేరువలో కొనసాగుతోంది. తాజాగా.. బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం (జూన్ 23 2024) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర పసిడి ధర 72,380 గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ 66,350 గా ఉంది.. వెండి ధర కిలో రూ.92,000లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,500, 24 క్యారెట్ల ధర రూ.72,530 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.66,350, 24 క్యారెట్లు రూ.72,380, చెన్నైలో 22క్యారెట్లు రూ.66,950, 24 క్యారెట్లు రూ.73,040, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.66,350, 24 క్యారెట్లు రూ.72,380గా ఉంది.

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22క్యారెట్లు రూ.66,350, 24 క్యారెట్లు రూ.72,380 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.96,500, ముంబైలో రూ.92,000, బెంగళూరులో రూ.92,950, చెన్నైలో రూ.96,500, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.96,500 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..