Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి మంచి ఛాన్స్.. హైదరాబాద్‏లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ ఎంతంటే..

|

Feb 22, 2021 | 6:43 AM

 బంగారం కోనాలనుకునేవారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు... సోమవారం ఉదయం దేశీయ మార్కెట్లో

Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి మంచి ఛాన్స్.. హైదరాబాద్‏లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ ఎంతంటే..
Follow us on

Gold Price Today In India: బంగారం కోనాలనుకునేవారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు… సోమవారం ఉదయం దేశీయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో బంగారం కోనుగోలు చేయాలనికునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.45,130 దగ్గర కొనసాగుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్ రేట్స్‏లో మార్పులు జరగలేదు.

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.43,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 47,190గా ఉంది. ఇక అటు విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేట్ 43,260 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,190 కొనసాగుతుంది. ఇక దేశ రాజధానీ ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.45,410ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.49,440గా ఉంది. ముంబై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,130 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.46,130 ఉంది. ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.43,770 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.47,750గా కొనసాగుతుంది. కాగా పసిడి ధర పై అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల్లోని బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెల్లరీ మార్కెట్ ఇలాంటివి గోల్డ్ రేట్స్ పై ప్రభావం చూపుతాయని చెప్పుకోవచ్చు.

Also Read:

Gold Loan: బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా..? అయితే తప్పనిసరిగా గుర్తించుకోవాల్సిన విషయాలు